నిన్నటి వరకూ పెరుగుతూ వచ్చిన బంగారం రేట్లు శుక్రవారం ఒక్కసారిగా కుప్పకూలాయి. ఇదే క్రమంలో వెండి రేటు కూడా కేజీకి రెండు రోజుల్లో రూ.10వేలు తగ్గిపోవటంతో కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రెండ్ చూస్తుంటే దీపావళి నాటికి రేట్లు మరింతగా తగ్గే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. అమెరికా వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచటం కూడా బులియన్ మార్కెట్లను అంతర్జాతీయంగా ప్రభావితం చేసిందని వారు చెబుతున్నారు. ఈ క్రమంలో షాపింగ్ చేద్దాం తగ్గిన రేట్లను సధ్వినియోగం చేసుకుందాం అనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లోని రిటైల్ రేట్లను పరిశీలించటం మంచిది.
అక్టోబర్ 30న బంగారం రేట్లు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.169 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 226గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 040గా కొనసాగుతోంది.
శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. అక్టోబర్ 30, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు తగ్గింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీకి రూ.5వేలు తగ్గి రూ.2లక్షల 10వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.210 దగ్గర ఉంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రానున్న మరికొద్ది రోజుల్లో వెండి రేట్లు ఇంకా తగ్గొచ్చని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
