ట్రాన్స్ జెండర్లు ఈ దందా కూడా స్టార్ట్ చేశారా...?  డేటింగ్ యాప్ పేరుతో రూ.20 లక్షల మోసం...

ట్రాన్స్ జెండర్లు ఈ దందా కూడా స్టార్ట్ చేశారా...?  డేటింగ్ యాప్ పేరుతో రూ.20 లక్షల మోసం...

సైబర్ మోసాలు రోజుకో రకంగా వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటిదాకా ఫెడెక్స్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్టులు అంటూ అమాయకులను మోసం చేసిన కేటుగాళ్లు ఇప్పుడు డేటింగ్ యాప్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. అది కూడా ట్రాన్స్ జెండర్లే ఎక్కువగా ఈ తరహా మోసాలకు పాల్పడుతుండటం గమనార్హం. బెంగుళూరులో మరో డేటింగ్ యాప్ ఫ్రాడ్ వెలుగులోకి వచ్చి. డేటింగ్ యాప్ ఇన్విటేషన్ పేరుతో ఓ వ్యక్తి నుంచి రూ. 20 లక్షలు కాజేశారు ట్రాన్స్ జెండర్లు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...

బెంగుళూరులోని నాగరాబావిలో అక్టోబర్ 23వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన కుటుంబంతో కలిసి ఆ ఇంట్లో నివసిస్తున్న ఒక ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి అయిన రోహిత్ (పేరు మార్చబడింది), తన స్నేహితుడైన హర్షవర్ధన్‌కు తాళాలు అప్పగించి హెసరఘట్టలోని తన సొంత ఇంటికి వెళ్ళాడు. రోహిత్ తన ఫ్రెండ్ ని ఒకరోజు ఇంట్లో ఉండమని తమిళనాడుకు బయలుదేరాడు.

ఈ క్రమంలో రోహిత్ ఫ్రెండ్ హర్షవర్ధన్ ఒక డేటింగ్ యాప్ లో ఓ మహిళతో పరిచయం పెంచుకొని.. ఆమెను రోహిత్ ఇంటికి ఆహ్వానించాడు.అయితే.. డేటింగ్ యాప్ లో మహిళగా పేర్కొన్న ట్రాన్స్ జెండర్ ముఖానికి మాస్క్ ధరించి ఇంటికి వచ్చింది. ఆ తర్వాత మరో ట్రాన్స్ జెండర్ ని ఇంటికి పిలిచి.. ఇద్దరు కలిసి హర్షవర్ధన్ ను కత్తులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. ఇద్దరు ట్రాన్స్ జెండర్లు కలిసి రూ.20 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు దోచుకొని వెళ్లారు.

ఈ ఘటనపై చంద్రలేఅవుట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నజియా, సయ్యద్ మౌషీన్ అనే ట్రాన్స్ జెండర్లను అదుపులోకి తీసుకున్నారు.