CULT Review: ‘కల్ట్’ సినిమా ఎలా ఉంది.. విశ్వక్ సేన్ ప్రయోగం వర్కౌట్ అయిందా?

CULT Review: ‘కల్ట్’ సినిమా ఎలా ఉంది.. విశ్వక్ సేన్ ప్రయోగం వర్కౌట్ అయిందా?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘కల్ట్’ (Cult). యాక్షన్, స్లాషర్ థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ఇవాళ (అక్టోబర్ 30న) థియేటర్లలో ఆడియన్స్ ముందుకు వచ్చింది. విశ్వక్ సేన్ డీఎస్పీ సంకల్ప్ నాయక్ పాత్రలో కనిపించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించగా, తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాశారు. మాస్క్ ధరించిన హంతకుడు, ప్రాణాల కోసం పోరాడే వ్యక్తులు, పోలీసు ఇన్వెస్టిగేషన్ వంటి అంశాలతో A రేటెడ్ సెర్టిఫికెట్తో వచ్చిన ఈ సినిమా ఎలాంటి థ్రిల్ ఇచ్చింది? విశ్వక్ సేన్ చేసిన ప్రయోగం ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ట్విట్టర్ టాక్లో తెలుసుకుందాం..

‘కల్ట్’ కథేంటంటే..

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘కల్ట్’ సినిమా కథ ఉత్కంఠభరితమైన సర్వైవల్ థ్రిల్లర్‌గా సాగుతుంది. సరదాగా పార్టీ చేసుకోవడానికి వెళ్లిన యువతీ యువకులకు అక్కడ ఎదురైన పరిస్థితులు ప్రాణాల కోసం పోరాడేలా చేస్తాయి.

పార్టీతో మొదలై.. ప్రాణాల కోసం పోరాటంగా..

గోవాలోని ఓ మారుమూల ప్రాంతంలో నిర్వహించే పార్టీకి పెద్ద సంఖ్యలో యువతీ యువకులు వెళ్తారు. దాదాపు 300 మందికి పైగా వ్యక్తులు అక్కడ చిక్కుకుపోతారు. మొదట్లో సాధారణ పార్టీలా కనిపించే ఆ ప్రదేశంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. మాస్కులు ధరించిన వ్యక్తులు అక్కడున్న వారిని లక్ష్యంగా చేసుకుంటారు. ఒక ప్రమాదకరమైన ఆటలో పాల్గొనాల్సిందిగా ఆదేశిస్తారు. ఆ ఆటలో ఓడిపోయిన వారికి మరణమే ఎదురవుతుందనే భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో అక్కడున్నవారు ఏం చేయాలో తెలియక భయాందోళనలకు గురవుతారు.

రంగంలోకి దిగిన డీఎస్పీ సంకల్ప్ నాయక్

ఈ పరిణామాల మధ్య విశ్వక్ సేన్ పోషించిన డీఎస్పీ సంకల్ప్ నాయక్ పాత్ర కథలో కీలకంగా మారుతుంది. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఉండే పోలీసు అధికారిగా కనిపించే సంకల్ప్.. ఈ ప్రమాదకరమైన వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? అక్కడ జరుగుతున్న హత్యలకు కారణం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు కనుగొనే ప్రయత్నం చేస్తాడు. మరోవైపు, ఆ ప్రదేశంలో చిక్కుకున్నవారికి తప్పించుకునే మార్గాలు కనిపించవు. చుట్టూ విద్యుత్ కంచె, బయటకు వెళ్లే మార్గాల వద్ద పేలుడు పదార్థాల ప్రమాదం ఉండటంతో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారతాయి. ప్రతి నిర్ణయం ప్రాణాలకు ముప్పుగా మారే ఈ పరిస్థితుల్లో సంకల్ప్ ఎలా ముందుకు సాగుతాడన్నదే కథలో మెయిన్ ఉత్కంఠ.

ఇక పార్టీకి వెళ్లినవారు ప్రాణాలతో బయటపడతారా? ఈ ప్రమాదకరమైన ఆట వెనుక ఉన్నది ఎవరు? డీఎస్పీ సంకల్ప్ నాయక్ నిందితులను ఎలా ఎదుర్కొంటాడు? అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో చూడాల్సిందే. ఇకపోతే.. ‘కల్ట్’తో విశ్వక్ సేన్ చేసిన ప్రయోగం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందా? లేదా? అన్నది ఇవాళ మొత్తం షోస్ తర్వాత ఆడియన్స్ టాక్ డిసైడ్ చేస్తుంది. కథ కనెక్ట్ అయితే, విశ్వక్ సేన్ డైరెక్టర్గా మరోసారి సక్సెస్ కొట్టినట్లే అని సినీ క్రిటిక్స్ చెబుతున్నారు..