చదువుకున్న వాళ్లు బీజేపీకి ఓటేయరా.. చదువుకున్న వాళ్లకు మాత్రమే ఎన్నికలు పెడితే బీజేపీ ఓడిపోతుందా.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అధికార బీజేపీ మంత్రి. అవును.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై స్పందించిన సదరు మంత్రి చేసిన కామెంట్స్ ఇవి. చదువుకున్న వాళ్లకు జరిగిన ఎన్నికలు ఇవి.. అందుకే బీజేపీ ఓడిపోయింది.. సాధారణ ఓటర్లు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఈ మంత్రి వ్యాఖ్యలతో సోషల్ మీడియా ఫుల్ జోష్ లోకి వచ్చింది. ఇంతకీ మంత్రి అన్న పూర్తి కామెంట్స్ ఏంటీ అనేది తెలుసుకుందామా..
ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ముఖ్యంగా ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసిలో సమాజ్‌వాదీ పార్టీ సాధించిన విజయాలపై బీజేపీ కూటమి భాగస్వామి, యూపీ కేబినెట్ మంత్రి వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. యూపీ మంత్రి ఓం ప్రకాష్ రాజ్‌భర్(SBSP చీఫ్) మాట్లాడుతూ ఈ ఎన్నికల ఫలితాలు సాధారణ ఓటర్ల తీర్పు కాదు, విద్యావంతులైన ఓటర్ల తీర్పు మాత్రమే అని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు, గ్రాడ్యుయేట్లు మాత్రమే ఓటు వేస్తారని, ఇది సాధారణ ప్రజలందరూ పాల్గొనే ఎన్నిక కాదని రాజ్‌భర్ గుర్తుచేశారు. అందువల్ల ఈ గెలుపును విద్యావంతుల తీర్పుగా మాత్రమే చూడాలని, సాధారణ ప్రజాభిప్రాయంగా భావించలేమని చెప్పారు.
సాధారణంగా విద్యావంతులైన ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల రోజున ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌ల వైపు రారని, ఆ రోజును ఓ హాలిడే గడుపుతారని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ బూత్‌లకు వచ్చేది సాధారణ ఓటర్లేనని, కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాబోయే ప్రధాన ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపవని ఎస్పీ విజయ ప్రాముఖ్యతను తగ్గించే ప్రయత్నం చేశారు.
Ambedkar Nagar, Uttar Pradesh: On UP MLC Election Results, Minister Om Prakash Rajbhar says, "First of all, you are educated people, so please understand. More than 14 lakh voters were involved in this MLC election, and around 6 lakh people actually voted. In the Assembly elections, there are around 14 crore voters, and we estimate that more than 8 crore people will vote..."
— IANS (@ians_india) October 29, 2026
