హైదరాబాద్ మాదాపూర్ లోని సున్నం చెరువుకు జలకళ సంతరించుకుంది. 2026 అక్టోబర్ 30న (శుక్రవారం) సాయంత్రం కురిసిన భారీ వర్షానికి చెరువుకు భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. మాదాపూర్‌లో 7 సెం.మీ. వర్షపాతం నమోదు కావడంతో సున్నం చెరువులోకి భారీగా వరద నీరు చేరుతోంది.
చుట్టుపక్కల ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి సున్నం చెరువులోకి వరద నీరు భారీగా చేరుతున్నది. 7 సెంటీమీటర్ల వర్షంతో చెరువుకు జలకళ సంతకరించుకుంది. ఇన్లెట్ల ద్వారా చెరువులోకి వర్షపు నీరు చేరుతున్నది.
సున్నం చెరువును ఇటీవలే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది హైడ్రా.10 నుంచి 15 అడుగుల మేర పూడిక తొలగించి చెరువును పునరుద్ధరించింది . దుర్గంధం తొలగించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు అధికారులు.
చెరువు చుట్టూ పాత్వే, పిల్లల ప్లే ఏరియాలు, గజీబోల నిర్మాణం ఏర్పాటు చేశారు. వర్షపు నీరు చెరువులోకి చేరుతుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరువులోకి వస్తున్న నీటిని వీడియోలు తీసి హైడ్రా కమిషనర్‌కు పంపారు.
సున్నం చెరువును త్వరలో ప్రారంభించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ప్రారంభోత్సవానికి ముందే ఎల్ నినో ప్రభావం, ఎండలతో చెరువు అడుగంటిన పరిస్థితి. ఇవాళ కురిసిన వర్షంతో చెరువులో మళ్లీ జలకళ సంతరించుకుంది. చెరువులో నీరు నిల్వ ఉండటంతో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అక్రమ బోర్ల తొలగింపుతో చెరువులో నీరు ఎక్కువకాలం నిలిచే అవకాశం ఉంది.
