బాలీవుడ్‌లో 'ఛావా' లాంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్, ఇప్పుడు మరొక సంచలన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బాలీవుడ్ లక్కీ బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం 'ఈఠా' (Eetha). మహారాష్ట్ర సాంస్కృతిక జానపద కళారూపం 'లావణీ', నాటక రంగమైన 'తమాషా' దిగ్గజం వితాబాయి నారాయణ్‌గావ్‌కర్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ బయోపిక్ తెరకెక్కుతోంది.
లేటెస్ట్ ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సంప్రదాయ నవవారి చీరకట్టులో, చేతికి గాజులు, కాళ్లకు గజ్జెలతో శ్రద్ధా కపూర్ స్టేజ్ పైకి వచ్చి వేసిన లావణీ నృత్యం అద్భుతమనే చెప్పాలి. "నాతో పోటీ పడి అదృష్టం కూడా గెలవలేదు!" అనే పంచ్ డైలాగులు, స్టేజ్ వెనుక ఆమె ఎదుర్కొన్న నమ్మకద్రోహాలు, కన్నీటి ఘట్టాలు ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
వితాబాయి జీవితంలో ఎదురైన అవమానాలు, నమ్మకద్రోహం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులను కూడా ట్రైలర్‌లో చూపించారు. 'నా నమ్మకమే నా గర్వం.. అది విరిగిపోయినప్పుడు అంతా కూలిపోయింది' అనే భావం వచ్చే డైలాగ్ భావోద్వేగానికి గురిచేస్తోంది. ఎన్ని కష్టాలు ఎదురైనా కళను వదులుకోని ఆమె పట్టుదల సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. నిండు గర్భిణిగా ఉన్నప్పుడు కూడా ప్రదర్శన ఇస్తూ, బ్యాక్‌స్టేజ్‌లోనే బిడ్డకు జన్మనిచ్చి మళ్లీ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన వితాబాయి నిజ జీవిత సన్నివేశం ప్రేక్షకుల గుండెలను పిండేస్తోంది.
'స్త్రీ' ఫ్రాంచైజీ వంటి భారీ విజయాల తర్వాత దినేష్ విజాన్ (మాడాక్ ఫిలింస్), కత్‌పుత్లీ క్రియేషన్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రసిద్ధ సంగీత ద్వయం అజయ్-అతుల్ అందించిన మాస్, జానపద బాణీలు థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో రణ్‌దీప్ హూడా, నానా పటేకర్, మహమ్మద్ జీషాన్ అయ్యూబ్ కీలక పాత్రల్లో కనిపించి సినిమా రేంజ్‌ను పెంచేశారు. మహారాష్ట్ర గర్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఈ ఎమోషనల్ అండ్ మాసివ్ డ్రామా డిసెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
