IIFA Awards 2026: ఐఫా అవార్డ్స్‌లో రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్' హవా.. ఏకంగా 12 అవార్డులు.. విజేతల పూర్తి జాబితా ఇదే!

IIFA Awards 2026: ఐఫా అవార్డ్స్‌లో రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్' హవా.. ఏకంగా 12 అవార్డులు.. విజేతల పూర్తి జాబితా ఇదే!

బాలీవుడ్‌లో అవార్డుల సందడి మొదలైతే ఫ్యాన్స్ కు పండగే. అందులోనూ ఐఫా (IIFA) అవార్డులంటే ప్రత్యేక క్రేజ్. ప్రతిష్ఠాత్మక 26వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) అవార్డ్స్ 2026 విజేతలను అక్టోబర్ 30న ప్రకటించారు. ఈసారి అవార్డుల వేటలో రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' రికార్డ్ సృష్టించింది. ఏకంగా 12 అవార్డులను తన ఖాతాలో వేసుకుని విజేతగా నిలిచింది. బెస్ట్ ఫిల్మ్ నుంచి బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్ వరకు కీలక పురస్కారాలను కొల్లగొట్టింది.

'ధురంధర్'లో తన పవర్‌ఫుల్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రణ్‌వీర్ సింగ్ ఉత్తమ కథానాయకుడి అవార్డును సొంతం చేసుకున్నారు. అదే సినిమాలో ప్రతినాయకుడిగా తనదైన ముద్ర వేసిన అక్షయ్ ఖన్నా నెగెటివ్ రోల్ విభాగంలో విజేతగా నిలిచారు. దర్శకుడు ఆదిత్య ధర్‌కు దర్శకత్వం, ఒరిజినల్ స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ విభాగాల్లో అవార్డులు లభించాయి. సంజయ్ దత్ ఉత్తమ సహాయ నటుడిగా నిలిచారు. 

మరోవైపు 'సైయారా' కూడా అవార్డుల వేటలో దూసుకుపోయింది. ఈ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అనీత్ పడ్డా ఉత్తమ కథానాయికగా నిలిచారు. అహాన్ పాండే ఉత్తమ నూతన నటుడిగా.. 'అజాద్' సినిమాతో పరిచయమైన రాషా థడానీ ఉత్తమ నూతన నటిగా అవార్డులు అందుకున్నారు. ఇక 'ఛావా' సాంకేతిక విభాగాల్లో మూడు అవార్డులను సొంతం చేసుకుంది.  'జాలీ ఎల్ఎల్‌బీ 3'లో నటనకు హ్యూమా ఖురేషీ గుర్తింపు పొందారు.

IIFA Awards 2026 విజేతల పూర్తి జాబితా..

బెస్ట్ ఫిల్మ్ – ధురంధర్
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ – అవతార్: ఫైర్ అండ్ యాష్
బెస్ట్ డైరెక్టర్ – ఆదిత్య ధర్ (ధురంధర్)
బెస్ట్ యాక్టర్ – రణ్‌వీర్ సింగ్ (ధురంధర్)
బెస్ట్ యాక్ట్రెస్ – అనీత్ పడ్డా (సైయారా)
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ – హ్యూమా ఖురేషీ (జాలీ ఎల్‌ఎల్‌బీ 3)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – సంజయ్ దత్ (ధురంధర్)
బెస్ట్ నెగెటివ్ రోల్ – అక్షయ్ ఖన్నా (ధురంధర్)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ – శాశ్వత్ సచ్‌దేవ్ (ధురంధర్)
బెస్ట్ ఒరిజినల్ స్టోరీ – ఆదిత్య ధర్ (ధురంధర్)
బెస్ట్ అడాప్టెడ్ స్టోరీ – హోమ్‌బౌండ్
బెస్ట్ లిరిక్స్ – ఇర్షాద్ కామిల్ (సైయారా)
బెస్ట్ మేల్ సింగర్ – ఫహీమ్ అబ్దుల్లా (సైయారా)
బెస్ట్ ఫిమేల్ సింగర్ – శ్రేయా ఘోషల్ (సైయారా)

టెక్నికల్ కేటగిరీలు

బెస్ట్ సినిమాటోగ్రఫీ – వికాశ్ నౌలఖా (ధురంధర్)
బెస్ట్ స్క్రీన్‌ప్లే – ఆదిత్య ధర్ (ధురంధర్)
బెస్ట్ డైలాగ్స్ – ఆదిత్య ధర్ (ధురంధర్)
బెస్ట్ ఎడిటింగ్ – శివకుమార్ వి. పనికర్ (ధురంధర్)
బెస్ట్ కొరియోగ్రఫీ – బాస్కో లెస్లీ మార్టిస్ (వార్ 2)
బెస్ట్ సౌండ్ డిజైన్ – బిశ్వదీప్ ఛటర్జీ (ధురంధర్)
బెస్ట్ సౌండ్ మిక్సింగ్ – అలోక్ దే (ఛావా)
బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ – ఏఆర్ రెహమాన్ (ఛావా)
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ – అసెంబ్లేజ్ ఎంటర్‌టైన్‌మెంట్, రీడిఫైన్ (ఛావా)

డెబ్యూ కేటగిరీలు

బెస్ట్ ఫిమేల్ డెబ్యూ – రాషా థడానీ (అజాద్)
బెస్ట్ మేల్ డెబ్యూ – అహాన్ పాండే (సైయారా)

 

డిజిటల్ విభాగాలు

IIFA డిజిటల్ ఫిల్మ్ అవార్డుల్లో బరాముల్లా బెస్ట్ పిక్చర్, బెస్ట్ ఒరిజినల్ స్టోరీ అవార్డులు గెలుచుకుంది. స్టోలెన్ చిత్రానికి బెస్ట్ డైరెక్షన్, బెస్ట్ యాక్టర్ మేల్ (అభిషేక్ బెనర్జీ) వచ్చాయి. Mrs చిత్రంలో నటించిన సన్యా మల్హోత్రా బెస్ట్ లీడింగ్ యాక్రెస్ అవార్డు అందుకున్నారు.

 'ది బా**డ్స్ ఆఫ్ బాలీవుడ్' బెస్ట్ సిరీస్ అవార్డు గెలుచుకుంది. ఆ సిరీస్‌కు ఆర్యన్ ఖాన్ బెస్ట్ డైరెక్షన్ అవార్డు అందుకున్నారు. పాతాళ్ లోక్ 2 నుంచి జైదీప్ అహ్లావత్ బెస్ట్ లీడింగ్ యాక్టర్ మేల్, తిల్లోతమ శోమె బెస్ట్ లీడింగ్ యాక్రెస్ అవార్డులు సాధించారు..

కరణ్ జోహార్, వరుణ్ ధావన్, అనన్య పాండే, మనీష్ పాల్‌ల హుషారైన యాంకరింగ్, పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్‌ల కామెడీ డిజిటల్ షోలతో తదుపరి ఐఫా వేడుకకు కూడా రంగం సిద్ధమవుతోంది. 27వ ఐఫా వీకెండ్ అండ్ అవార్డ్స్ 2027 జనవరి 22, 23 తేదీల్లో అబుదాబిలోని యాస్ ఐలాండ్, ఎతిహాద్ అరేనాలో జరగనుంది. దీంతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినీ తారల సందడి మొదలుకానుంది..