భారత్‌కు దిమ్మతిరిగే షాక్.. టీ20 హిస్టరీలో టీమిండియా ఘోర పరాజయాలు ఇవే!

భారత్‌కు దిమ్మతిరిగే షాక్.. టీ20 హిస్టరీలో టీమిండియా ఘోర పరాజయాలు ఇవే!

Team India: టీ20 క్రికెట్‌లో భారత జట్టు ఎన్నో చారిత్రాత్మక విజయాలు సాధించి ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. కానీ మ్యాచ్ గమనాన్ని మార్చే అత్యంత వేగవంతమైన ఈ ఫార్మాట్‌లో అప్పుడప్పుడు అగ్రశ్రేణి జట్లకు కూడా ఊహించని పరాజయాలు ఎదురవుతుంటాయి. ఈరోజు (అక్టోబర్ 30, శుక్రవారం) ఆక్లాండ్ వేదికగా జరిగిన నాలుగో టీ20 (4th T20I) మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో 87 రన్స్ తేడాతో ఘోరంగా ఓడిపోవడంతో టీమిండియా భారీ ఓటముల జాబితాలో సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. అంతర్జాతీయ టీ20 (T20I) చరిత్రలోనే పరుగుల పరంగా ఇండియన్ టీమ్ ఎదుర్కొన్న 'టాప్ 5' ఘోర ఓటముల గురించి ఇప్పుడు V6 వెలుగు వెబ్ సైట్ లో తెలుసుకుందాం.. 

ఇంగ్లాండ్‌పై 125 రన్స్ తేడాతో పరాజయం (2026, నాటింగ్‌హామ్):

టీమిండియా టీ20 చరిత్రలోనే ఇది అత్యంత దారుణమైన ఓటమి.. నాటింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి ఫిల్ సాల్ట్ (70) ధాటికి 201/7 రన్స్ చేసింది. ఛేజింగ్‌లో భారత బ్యాటింగ్ ఆర్డర్ ఘోరంగా విఫలమై కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయింది. జోష్ టంగ్ (4 వికెట్లు), జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్‌ లాంటి బౌలర్ల ధాటికి భారత్ 125 పరుగుల తేడాతో కుప్పకూలింది.

న్యూజిలాండ్‌పై 87 రన్స్తో ఓటమి (2026, ఆక్లాండ్):

2026, అక్టోబర్ 30న ఆక్లాండ్‌లో జరిగిన మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ (49 బంతుల్లో 107 - 10 సిక్సర్లు), మైఖేల్ బ్రేస్‌వెల్ (65) విజృంభణతో న్యూజిలాండ్ 259/7 భారీ స్కోరు చేసింది. ఛేదనలో టీమిండియా బ్యాటర్లు ఒత్తిడికి లోనై 20 ఓవర్లలో 172/9 పరుగులకే పరిమితమయ్యారు. జాకబ్ డఫీ 4 వికెట్లతో విరుచుకుపడటంతో ఇండియన్ టీమ్ 87 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలై ఈ లిస్టులో రెండో స్థానంలో నిలిచింది.

కివీస్పై 80 పరుగుల ఓటమి (2019, వెల్లింగ్టన్):

వెల్లింగ్టన్ స్టేడియంలో టీమ్ సీఫెర్ట్ (84) మెరుపు బ్యాటింగ్ తో న్యూజిలాండ్ జట్టు 219/6 స్కోరు సాధించింది. సమాధానంగా బరిలోకి దిగిన టీమిండియా, సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ శుభారంభం ఇచ్చినప్పటికీ ఆ తర్వాత వరుసగా వికెట్లని నష్టపోయింది. టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్, మిచెల్ శాంట్నర్‌ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు భారత్ 139 రన్స్ కే పరిమితమై 80 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది.

సౌతాఫ్రికాపై 76 రన్స్ తేడాతో ఓటమి (2026, అహ్మదాబాద్):

టీ20 ప్రపంచకప్‌లో అహ్మదాబాద్ వేదికగా ప్రొటీస్ జట్టు భారత్‌ను గట్టి దెబ్బ తీసింది. డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్ ధాటికి దక్షిణాఫ్రికా 187/7 రన్స్ చేయగా, ఛేజింగ్‌లో శివమ్ దూబే (42) ఒక్కడే పోరాడాడు. మిగిలిన టీమిండియా బ్యాటర్లందరూ తీవ్రంగా నిరాశపరచడంతో భారత్ కేవలం 111 పరుగులకే కుప్పకూలి 76 పరుగులతో పరాజయాన్ని మూటగట్టుకుంది.

దక్షిణాఫ్రికాపై 51 పరుగుల ఓటమి (2025, చండీగఢ్): 

చండీగఢ్‌లో క్వింటన్ డి కాక్ (90) కిరాక్ ఇన్నింగ్స్‌తో ప్రొటీస్ జట్టు 213/4 భారీ స్కోరు సాధించింది. టార్గెట్ ఛేదనలో తిలక్ వర్మ (62), హార్దిక్ పాండ్యా రాణించినప్పటికీ, వేగంగా పరుగులు రాబట్టలేకపోయారు. ఆఖర్లో కేవలం 5 రన్స్ వ్యవధిలోనే వరుసగా 5 వికెట్లు కోల్పోయిన భారత్ 162 పరుగులకు ఆలౌటై 51 రన్స్ తేడాతో ఓటమిని చవిచూసింది.