ద్రవిడ్, సెహ్వాగ్ వారసులకు టీమిండియాలో చోటు.. అండర్-19 స్వ్కాడ్ ఇదే!

ద్రవిడ్, సెహ్వాగ్ వారసులకు టీమిండియాలో చోటు.. అండర్-19 స్వ్కాడ్ ఇదే!

U19 Asia Cup Squad: భారత క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, వీరేందర్ సెహ్వాగ్‌ల సుపుత్రులు అన్వయ్ ద్రవిడ్ (Anvay Dravid), ఆర్యవీర్ సెహ్వాగ్ (Aaryavir Sehwag)లు జాతీయ జట్టు తరఫున చెలరేగేందుకు సిద్ధమయ్యారు. నవంబర్ 5 నుంచి 14వ తేదీ వరకు ఒమన్ రాజధాని మస్కట్ వేదికగా జరగనున్న ACC పురుషుల అండర్-19 ఆసియా కప్ (ACC Men's U19 Asia Cup) టోర్నీ కోసం ప్రకటించిన భారత జట్టులో వీరిద్దరికీ చోటు దక్కింది. ఇటీవల ముగిసిన వినూ మన్కడ్ ట్రోఫీలో ఇద్దరూ అద్భుత ప్రదర్శనతో సంచలనం సృష్టించి భారత జట్టులోకి ఎంపికయ్యారు. 

వినూ మన్కడ్ ట్రోఫీలో సెంచరీల పర్వం: 

* అన్వయ్ ద్రవిడ్ (17 ఏళ్లు): కర్ణాటకకు ప్రాతినిధ్యం వహిస్తున్న అన్వయ్, గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 300+ పరుగుల ఛేజింగ్‌లో కేవలం 100 బంతుల్లో 151 రన్స్ కొట్టి జట్టును గెలిపించాడు. జూలైలో శ్రీలంకపై జరిగిన యూత్ వన్డేలోనూ 67 బంతుల్లో 87 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

* ఆర్యవీర్ సెహ్వాగ్ (19 ఏళ్లు): ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన ఆర్యవీర్, విజయనగరంలో ఛండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 143 బంతుల్లో 173 పరుగులతో భారీ సెంచరీ బాది తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు.

ఆరోజే భారత్ vs పాకిస్థాన్ పోరు: 

* ఆసియా కప్‌లో భారత జట్టు గ్రూప్-ఎ (Group A) లో యుఏఈ, నేపాల్, మరియు సాంప్రదాయ ప్రత్యర్థి పాకిస్థాన్‌తో కలిసి ఉంది. గ్రూప్- బీలో బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, మలేషియా జట్లు పోటీ పడుతున్నాయి. రెండు గ్రూపుల నుంచి టాప్ -2 జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.

* నవంబర్ 6: భారత్ vs నేపాల్ (మస్కట్)

* నవంబర్ 8: భారత్ vs పాకిస్థాన్ (మస్కట్)

* నవంబర్ 10: భారత్ vs యుఏఈ (మస్కట్)

భారత అండర్-19 జట్టు (India U19 Squad):

లక్ష్య రాయ్‌ చందానీ (కెప్టెన్), ఆర్యవీర్ సెహ్వాగ్, వి.కె. వినీత్, యశ్‌బర్ధన్ సింగ్ చౌహాన్ (వైస్ కెప్టెన్), కుశాగ్ర్ ఓఝా, అర్జున్ రాజ్‌పుత్, మనల్ చౌహాన్, అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), రజత్ బఘేల్ (వికెట్ కీపర్), వి. యశ్‌వీర్, ఆర్యన్ సవసాని, మోహిత్ ఉల్వా, కావ్య పటేల్, షావిన్ వినోద్, ఇషాన్ సూద్.

►ALSO READ | భారత్‌పై 87 రన్స్ తేడాతో ఘన విజయం.. మ్యాచ్ గెలిచి పరువు నిలుపుకున్న న్యూజిలాండ్