ఆ ఒక్క తప్పు వల్లే మేము ఓడిపోయాం.. భారత బౌలింగ్పై శ్రేయస్ కామెంట్స్ వైరల్!

ఆ ఒక్క తప్పు వల్లే మేము ఓడిపోయాం.. భారత బౌలింగ్పై శ్రేయస్ కామెంట్స్ వైరల్!

Shreyas Iyer: ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో 87 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసిన అనంతరం భారత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) స్పందించాడు. మా బౌలింగ్ వైఫల్యమే తమ ఓటమికి ప్రధాన కారణమని ఒప్పుకున్నాడు.. సెంచరీతో చెలరేగిన కివీస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ ప్రదర్శనను శ్రేయస్ అయ్యర్ కొనియాడాడు.

శ్రేయస్ అయ్యర్ పోస్ట్-మ్యాచ్ కామెంట్స్: 

మ్యాచ్ అనంతరం మీడియాతో శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. భారత జట్టు ఓడిపోవడానికి అసలు నిజం చెప్పాలంటే ఈరోజు మేము మెరుగ్గా బౌలింగ్ చేయలేకపోయాం.. పవర్‌ప్లేలో మూడో ఓవర్ నుంచే న్యూజిలాండ్ బ్యాటర్లకు మూమెంటమ్ దొరికింది.. మా బౌలర్లు కట్టడి చేయడానికి ఎంతో ప్రయత్నించినప్పటికీ ఫలితం మాత్రం దొరకలేదన్నాడు. ఇక గ్లెన్ ఫిలిప్స్ అసాధారణంగా చెలరేగాడు.. అతను ఆడిన షాట్లు చూడముచ్చటగా ఉన్నాయి. ఈ సిరీస్ ఆసాంతం నిలకడగా ఆడుతున్న అతన్ని చూసి మేం చాలా నేర్చుకోవాలి అన్నాడు. 

చివరి మ్యాచ్‌పైనే మా దృష్టి: 

ఈరోజు చేసిన తప్పిదాలను బేరీజు వేసుకుంటాం.. చివరి టీ20కి ఒక్క రోజే సమయం ఉన్నందున, మా ప్రణాళికలను మార్చుకుని 100 శాతం విజయంతో ముగించేందుకు ప్రయత్నిస్తామని భారత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు. తొలి మూడు మ్యాచ్‌లలో మన కుర్రాళ్ళు ఆడిన తీరు అద్భుతం.. ఈ ఓటమి మాకు ఒక మంచి గుణపాఠం అని సర్పంచ్ సాబ్ పేర్కొన్నాడు.

మ్యాచ్ హైలైట్స్: 

న్యూజిలాండ్ భారీ స్కోరు: గ్లెన్ ఫిలిప్స్ (49 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్సర్లతో 107 పరుగులు), మైఖేల్ బ్రేస్‌వెల్ (65) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 259/7 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు పెట్టింది. ఇక టీమిండియా బౌలర్లలో మయాంక్ యాదవ్ 3 వికెట్లు తీసినా నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, మయాంక్ యాదవ్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 

భారత ఛేజింగ్ విఫలం: 260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 172 రన్స్ మాత్రమే చేయగలిగింది. తిలక్ వర్మ (35), నమన్ ధీర్ (28), అభిషేక్ శర్మ (27) రాణించినప్పటికీ.. కివీస్ బౌలర్ జాకబ్ డఫీ (4/19) భారత్ పతనంలో కీలక పాత్ర పోషించి విజయం అందించాడు. ఈ ఓటమితో 5 మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 3–1 ఆధిక్యంలో భారత్ వైపు ఉండగా, చివరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను ముగించాలని శ్రేయస్ సేన భావిస్తోంది.