అర్నాబ్ తుపాను వెళ్లిపోయింది. అయితే దాని కదలికలకు సంబంధించి ఇస్రో ఉపగ్రహ చిత్రాలను, వీడియోలను రిలీజ్ చేసింది. తుపాను కదలికలకు సంబంధించి ప్రతి 30 నిమిషాలకోసారి చిత్రీకరించిన ఇస్రో టైమ్‌లాప్స్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
అక్టోబర్ 28న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకిన అత్యంత తీవ్ర తుఫాను ‘అర్నబ్’ కదలికలకు సంబంధించిన టైమ్‌లాప్స్ వీడియోను ఇస్రో 2026 అక్టోబర్ 30న విడుదల చేసింది. ఇన్‌శాట్-3డీఎస్ ఉపగ్రహం సేకరించిన దృశ్యాల ఆధారంగా రూపొందించిన ఈ వీడియోలో తుఫాను మేఘాల కదలికలు, తీరంవైపు దాని ప్రయాణం స్పష్టంగా కనిపిస్తున్నాయి.
దాదాపు ప్రతి 30 నిమిషాలకు ఒకసారి ఉపగ్రహం చిత్రీకరించిన దృశ్యాలను కలిపి ఈ టైమ్‌లాప్స్ రూపొందించారు. తుఫాను కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంలో భారత ఉపగ్రహ వ్యవస్థ ఎంత కీలకంగా పనిచేస్తుందో ఈ వీడియో తెలియజేస్తోంది.
తుఫాను తీరం దాటి బలహీనపడినప్పటికీ.. దాని ప్రయాణాన్ని ఆకాశం నుంచి చిత్రీకరించిన ఈ దృశ్యాలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
⏩️ 𝗧𝗶𝗺𝗲𝗹𝗮𝗽𝘀𝗲 𝗼𝗳 𝗖𝘆𝗰𝗹𝗼𝗻𝗲 𝗔𝗿𝗻𝗮𝗯 𝗳𝗿𝗼𝗺 𝗜𝗦𝗥𝗢'𝘀 𝗜𝗡𝗦𝗔𝗧-𝟯𝗗𝗦 𝘀𝗮𝘁𝗲𝗹𝗹𝗶𝘁𝗲 🌀 Cyclone Arnab was a very severe class cyclonic storm that made landfall on Andhra Pradesh on the early hours of 28 October 2026. It was extensively imaged by India's Geostationary satellite fleet including the INSAT-3DS meteorological satellite that imaged it at roughly 30 minute intervals to allow Indian authorities to track the cyclone live and take precautionary safety measures.
— ISRO Spaceflight (@ISROSpaceflight) October 30, 2026
