వైభవ్‌ను మళ్లీ పక్కన పెట్టడంపై నెట్టింట రచ్చ.. CSK మాజీ కోచ్ కీలక వ్యాఖ్యలు!

వైభవ్‌ను మళ్లీ పక్కన పెట్టడంపై నెట్టింట రచ్చ.. CSK మాజీ కోచ్ కీలక వ్యాఖ్యలు!

Stephen Fleming: న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20 (4th T20I) మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టు (Playing XI) నుంచి 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi)ని పక్కనబెట్టడంపై న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ (Stephen Fleming) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫిట్‌నెస్‌ సాధించి తిరిగొచ్చిన ఇషాన్ కిషన్ (Ishan Kishan) కోసం వైభవ్‌ను బెంచ్‌కే పరిమితం చేయడాన్ని ఫ్లెమింగ్ సమర్థించాడు.

సూర్యవంశీకి టైం వస్తుంది: స్టీఫెన్ ఫ్లెమింగ్

మూడో టీ20లో కేవలం 19 బంతుల్లోనే 45 రన్స్ కొట్టి అభిషేక్ శర్మతో కలిసి 7.1 ఓవర్లలోనే 133 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన వైభవ్‌ను పక్కన బెట్టడంపై సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. అతనికి సమయం వస్తుంది, భవిష్యత్తులో అతనే జాతీయ జట్టులో కీలక ఆటగాడిగా నిలుస్తాడు. అయితే ఒక మ్యాచ్ ఆడించి వెంటనే డ్రాప్ చేయడం లేదా తుది జట్టులో స్థానం మార్చడం విషయంలో భయం కల్పించడం వలన ఆటగాళ్లు ఫామ్ కోల్పోయే ప్రమాదం ఉందన్నాడు. జట్టులో ప్లేస్ ప్రమాదంలో ఉందనే భావన వస్తే, ప్లేయర్స్ నిర్భయంగా ఆడలేరు.. అందుకే ఈ విరామం అతని ఎదుగుదలకు చాలా మంచిదన్నాడు. 

ఇషాన్ కిషన్ డకౌట్.. కుప్పకూలిన భారత్:

వైభవ్ సూర్యవంశీ స్థానంలో జట్టులోకి తిరిగొచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం 3 బంతులు మాత్రమే ఎదుర్కొని డకౌట్ (0) గా వెనుతిరిగాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ బ్యాటర్లు గ్లెన్ ఫిలిప్స్ (107), మైఖేల్ బ్రేస్‌వెల్ (65) విధ్వంసంతో 259/7 భారీ స్కోరు చేసింది.

లక్ష్య ఛేదనకు దిగిన భారత ఓపెనర్లు సంజు శాంసన్ (4), ఇషాన్ కిషన్ (0) ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక నిర్ణీత 20 ఓవర్లలో 172/9 పరుగులకే పరిమితమై 87 రన్స్ తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. ఈ ఓటమితో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 3–1 ఆధిక్యంలో ఉండగా, చివరి టీ20 మ్యాచ్ ఆదివారం (నవంబర్ 1) జరగనుంది.