ఉత్తరాఖండ్‎లో హెలికాప్టర్ ప్రమాదంలో పైలట్ సహా ఆరుగురు మృతి.. మృతులంతా కర్నాటక వాసులే

ఉత్తరాఖండ్‎లో హెలికాప్టర్ ప్రమాదంలో పైలట్ సహా ఆరుగురు మృతి.. మృతులంతా కర్నాటక వాసులే

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా జోషిమఠ్ సమీపంలో విమానం కుప్పకూలిన ఘటనలో పైలట్ సహా ప్రయాణికులు ఆరుగురు మరణించారు. ఉత్తరఖాండ్ ప్రభుత్వం దీనిని అధికారికంగా ధృవీకరించింది. మృతులను ప్రతాప్, అరుణ్, శంకర్ గౌడ, సుధీర్ కె. ఎస్.ఎస్. నటరాజ్‌గా గుర్తించారు. వీరంతా కర్నాటక రాష్ట్రానికి చెందినవారు. వీరిలో ఒకరు బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ అరుణ్ సాలుంకే కాగా, మిగిలిన నలుగురు న్యాయవాదులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పైలట్ కెప్టెన్ హిమాన్షు సబర్వాల్ కూడా మరణించారు. ఈ విషాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఉత్తరాఖండ్‎లో హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. బద్రీనాథ్ ధామ్ నుంచి తిరిగి వస్తుండగా పైలట్‎తో సహా ఆరుగురు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ చమోలి జిల్లా జోషిమఠ్ సమీపంలోని చాయ్ గ్రామం సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలింది. బద్రీనాథ్ ప్రాంతంలో మంచు కురుస్తుండటం, భారీ వర్షం, దట్టమైన మేఘాల కారణంగా ప్రతికూల వాతావరణం ఏర్పడటమే ఈ ప్రమాదానికి కారణం. సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. 

జిల్లా యంత్రాంగం, విపత్తు నిర్వహణ శాఖ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, భారత సైన్యం, ఐటీబీపీ బృందాలు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టాయి. హెలికాప్టర్ ప్రమాదాన్ని చమోలీ జిల్లా మేజిస్ట్రేట్ గౌరవ్ కుమార్ ధృవీకరించారు. ఈ ఘటన గురించి సైన్యం పరిపాలనా యంత్రాంగానికి తెలియజేసిందని ఆయన తెలిపారు. హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఆరుగురు కూడా మరణించారని ఆయన ధృవీకరించారు. ఈ విషాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.