IND vs NZ: న్యూజిలాండ్ పర్యటనలో అన్-స్టాపబుల్‌గా కొనసాగుతున్న టీమిండియా విజయ పరంపరకు ఆక్లాండ్ వేదికగా అడ్డుకట్ట పడింది. ఈ రోజు (2026, అక్టోబర్ 30, శుక్రవారం) జరిగిన నాలుగో టీ20 (4th T20I) మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టిన కివీస్ జట్టు.. ఏకంగా 87 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా భారత్‌పై న్యూజిలాండ్‌కు ఇది అతి పెద్ద విజయం కావడం గమనార్హం. ఈ గెలుపుతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను న్యూజిలాండ్ 3–1కి తగ్గించుకుని పరువుని కాపాడుకుంది.
ఫిలిప్స్, బ్రేస్‌వెల్ విధ్వంసం.. 259 పరుగుల వర్షం:
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే మయాంక్ యాదవ్ గట్టి షాకిచ్చినా, ఆ తర్వాత కివీస్ బ్యాటర్లు భారత్ బౌలింగ్‌ను పీకి పందెమేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 259 పరుగులు చేసింది.
* గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ: కేవలం 49 బంతుల్లో 6 ఫోర్లు, 10 భారీ సిక్సర్లతో 107 రన్స్ చేసి భారత బౌలర్లకు నరకం చూపించాడు.
* బ్రేస్‌వెల్ హాఫ్ సెంచరీ: మైఖేల్ బ్రేస్‌వెల్ కేవలం 25 బంతుల్లోనే 65 పరుగులు బాది ఫిలిప్స్‌కు అండగా నిలిచాడు.
* బౌలింగ్‌లో ధారాళం: భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి (64 రన్స్), ప్రిన్స్ యాదవ్ (49 రన్స్), మయాంక్ యాదవ్ (48 రన్స్) భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
172 రన్స్‌కే కుప్పకూలిన భారత్.. డఫీ 4 వికెట్ల దాడి:
260 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా ఇన్నింగ్స్ విజయతీరాల వైపు పయనించలేదు. కివీస్ ఫాస్ట్ బౌలర్ జాకబ్ డఫీ (4/17) ధాటికి భారత టాప్ ఆర్డర్ కకావికలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 172/9 పరుగులకు మాత్రమే పరిమితమైంది.
* విఫలమైన టాప్ ఆర్డర్: ఇషాన్ కిషన్ (0), సంజు శాంసన్ (4), అక్షర్ పటేల్ (7) త్వరగానే పెవిలియన్ చేరారు.
* పోరాడినా నో ఫలితం: తిలక్ వర్మ (35), నమన్ ధీర్ (28), అభిషేక్ శర్మ (27), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (22), నితీష్ కుమార్ (21) కొద్దిసేపు పోరాడినా భారీ లక్ష్యం ముందు తేలిపోయారు. చివర్లో ప్రిన్స్ యాదవ్ (18* నాటౌట్) దూకుడుగా ఆడాడు.
* న్యూజిలాండ్ బౌలింగ్: డఫీ 4 వికెట్లతో చెలరేగగా, కెప్టెన్ మిచెల్ సాంట్నర్, మాథ్యూ ఫిషర్‌లు తలో 2 వికెట్లు పడగొట్టారు.
New Zealand win by 87 runs in Auckland. Our focus shifts to the 5th T20I in Hamilton on Sunday. Scorecard ▶️ https://t.co/fx264c9iLe #TeamIndia | #NZvIND https://t.co/mZccr7XMfl
— BCCI (@BCCI) October 30, 2026
