దీపావళికి ముందే కార్ల కంపెనీల బంపర్ ఆఫర్లు.. ఈ 5 కార్లపై లక్షన్నర వరకు కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

దీపావళికి ముందే కార్ల కంపెనీల బంపర్ ఆఫర్లు.. ఈ 5 కార్లపై  లక్షన్నర వరకు కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

దీపావళి పండగకు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని టాటా, మారుతి సుజుకి, సిట్రోయెన్, టయోటా వంటి కంపెనీలు  కార్ల పై భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. ముఖ్యంగా హ్యాచ్‌బ్యాక్ కార్లపై అదిరిపోయే ఆఫర్లు, డిస్కౌంట్స్  ఉన్నాయి.....

ఈ ఆఫర్లు కారు మోడల్, వేరియంట్, స్టాక్‌ను బట్టి మారుతుంటాయి. టాటా టియాగో ఈవీ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్‌పై అత్యధికంగా రూ.1.45 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. మరి ఏ కారు మీద ఎంత తగ్గింపు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం....

1. టాటా టియాగో ఈవీపై రూ.1.45 లక్షల వరకు  
దీపావళి సందర్భంగా టాటా మోటార్స్  టియాగో ఈవీ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్‌పై భారీ ఆఫర్లను అందిస్తోంది. పాత మోడల్‌కు సంబంధించిన మిగిలిన స్టాక్‌పై రూ.1.45 లక్షల వరకు ప్రయోజనాలు పొందవచ్చు.

ఈ ఆఫర్లలో భాగంగా.. రూ.1 లక్ష వరకు క్యాష్  తగ్గింపు, రూ.50,000 వరకు ఇంటర్వెన్షన్ ఆఫర్, రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో 19kWh, 24kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, దీని టాప్  రేంజ్ 293 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ కారు  ఎక్స్-షోరూమ్ ధర రూ.7.99 లక్షల నుంచి రూ.11.14 లక్షల వరకు ఉంటుంది.


2. సిట్రోయెన్ C3పై రూ.1.18 లక్షల వరకు 
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్  బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ C3 కారు పై రూ.1.18 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న కారు కొనాలనుకునే వారికి ఈ ఆఫర్ ఉపయోగపడుతుంది. సిట్రోయెన్ C3లో రెండు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి.
*నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 82 hp పవర్, 115 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
*టర్బో పెట్రోల్ ఇంజన్ 110 hp పవర్, 190-205 Nm టార్క్‌ను అందిస్తుంది.
ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.4.99 లక్షల నుంచి రూ.9.68 లక్షల వరకు ఉంటుంది.


3. మారుతి స్విఫ్ట్‌పై రూ.71,000 వరకు ఆఫర్లు
మారుతి సుజుకి స్విఫ్ట్ కొనాలనుకునే వారికి కూడా పండగ ఆఫర్లు ఉన్నాయి. స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్‌పై యాక్సెసరీ కిట్‌లతో కలిపి రూ.71,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి.
ఇతర పెట్రోల్ వేరియంట్లపై..
*రూ.10,000 వరకు క్యాష్ తగ్గింపు
*రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్
*రూ.5,000 వరకు ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. 
స్విఫ్ట్ పెట్రోల్, CNG రెండు ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. పెట్రోల్ వెర్షన్ 83 hp పవర్, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. CNG వెర్షన్ 70 hp పవర్, 102 Nm టార్క్‌ను అందిస్తుంది. స్విఫ్ట్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ.5.84 లక్షల నుంచి రూ.8.74 లక్షల వరకు ఉంటాయి.


4. మారుతి సెలెరియోపై రూ.67,500 వరకు 
మారుతి సుజుకి సెలెరియోపై కూడా పండగ ఆఫర్లు ప్రకటించారు. ఈ కారు కొనుగోలుపై రూ.67,500 వరకు ప్రయోజనాలు పొందవచ్చు.
ఈ ఆఫర్లలో..
*రూ.40,000 వరకు క్యాష్ తగ్గింపు
*రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్
*రూ.2,500 వరకు ఇతర ప్రయోజనాలు ఉన్నాయి.
సెలెరియో పెట్రోల్, CNG వెర్షన్లలో లభిస్తుంది. ఇందులో 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ ఉంటుంది. పెట్రోల్ వెర్షన్ 69 hp పవర్, 91 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. CNG వెర్షన్ 57 hp పవర్, 82 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.4.70 లక్షల నుంచి రూ.6.75 లక్షల వరకు ఉంటుంది.


5. మారుతి వాగన్ ఆర్‌పై రూ.67,000 వరకు 
మారుతి సుజుకి వాగన్ ఆర్‌పై కూడా దీపావళి ఆఫర్లు  ఉన్నాయి. వాగన్ ఆర్ వాల్ట్జ్ ఎడిషన్‌పై రూ.67,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి.

ఈ ఆఫర్లలో భాగంగా..
*రూ.38,000 విలువైన ఉచిత యాక్సెసరీలు
*రూ.1,900 విలువైన అదనపు ప్రయోజనాలు
ఇతర వేరియంట్లపై కూడా ఇంజన్, వేరియంట్‌ను బట్టి రూ.57,500 వరకు ప్రయోజనాలు అందిస్తున్నారు. వాగన్ ఆర్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ.4.99 లక్షల నుంచి రూ.7.24 లక్షల వరకు ఉంటుంది.

దీపావళికి కారు కొనాలనుకునే వారికి మంచి అవకాశం!
దీపావళి పండుగకు ముందు కొత్త కారు కొనాలనుకునే వారికి ఈ ఆఫర్లు ఉపయోగపడతాయి. ముఖ్యంగా టాటా టియాగో ఈవీ, మారుతి స్విఫ్ట్, సెలెరియో, వాగన్ ఆర్ వంటి కార్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు ఉన్నాయి.

అయితే, ఈ తగ్గింపులు అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండకపోవచ్చు. డీలర్, స్టాక్, మోడల్, వేరియంట్‌ను బట్టి ఆఫర్లు మారుతాయి. కాబట్టి కారు కొనే  ముందు మీ దగ్గరలోని  షోరూమ్‌లో ఆఫర్ల వివరాలు తెలుసుకోవడం మంచిది.