విశాఖపట్నం పోర్టులోని సీ హార్స్ జంక్షన్ సమీపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పోర్టు ప్రాంగణంలో జె.ఎం. భక్షి కంపెనీకి చెందిన నిర్మాణంలో ఉన్న కన్వేయర్ బెల్ట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. తీవ్ర భయాందోళనకు గురైన కార్మికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న విశాఖపట్నం పోర్టు అగ్నిమాపక సిబ్బంది వెంటనే హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫైరింజన్ల సహయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ ఫైటర్స్ ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, ప్రాణ, ఆస్తి నష్టం, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
