ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తిరుపతి జనసేన అభ్యర్థి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కార్పొరేటర్ సీట్ కోసం 50 లక్షలు రూపాయలు డిమాండ్ చేశారని ఆరోపిస్తూ రాజేష్ ఆచారి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
అంతకు ముందు వీడియో రిలీజ్ చేసిన రాజేష్ ఆచారి 47వ డివిజన్ అభ్యర్థిగా నామినేషన్ వేసినా, బీ-ఫామ్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హవాయి చెప్పులు వేసుకున్న వాడిని అసెంబ్లీకి పంపిస్తామన్న పవన్ కళ్యాణ్.. ఈ రోజు ఎక్కడికెళ్లారని ప్రశ్నించారు.
తిరుపతిలో కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేయాలంటే 50 లక్షలు డిమాండ్ చేస్తున్నారు.. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నాశనం అయిపోతాడు అంటూ ఆరోపించారు.
తిరుపతిలో మొదట జనసేన పార్టీ కార్పోరేటర్ అభ్యర్థిగా కార్యాలయం ఓపెన్ చేసింది తనేనని రాజేష్ అన్నారు. పవన్ కళ్యాణ్ నా చావును చూసిన తర్వాత తిరుపతికి వస్తారు అనుకుంటున్నానని భావోద్వేగానికి గురయ్యారు.
