రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో ఫామ్ హౌస్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. చేవెళ్లలోని కమ్మెట గ్రామ పరిధిలోగల ఎల్జీ ఫామ్ హౌస్ లో పార్టీ జరుగుతున్నట్లు తెలుసుకున్న ఎస్ఓటీ స్థానిక పోలీసులు రైడ్స్ నిర్వహించారు. 2026 అక్టోబర్ 30న జరిగిన తనిఖీల్లో ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఉన్నట్లు గుర్తించారు.
రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం దొంతన్ పల్లి గ్రామ పరిధిలోగల ఐబీఎస్ ఇఫ్కాయ్ యూనివర్సిటీ చెందిన 49 మంది విద్యార్థులు ఈ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. 49 మందిలో 25 మంది వరకు గర్ల్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఐబీఎస్ కాలేజీకి చెందిన బీబీఎస్, ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన విద్యార్థులు ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీలో పాల్గొన్న విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
