హైదరాబాద్ 550 ఎకరాలు ప్రభుత్వానికే చెందుతుందని సుప్రీం కోర్టు తీర్పుతో భూముల స్వాధీన ప్రక్రియ ప్రారంభించింది ప్రభుత్వం. 2026 అక్టోబర్ 30న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి భూముల స్వాధీన ప్రక్రియను పర్యవేక్షించారు.
మియాపూర్ లోని550 ఎకరాల భూమి హెఎండీఏ ఆధీనంలో ఉందని కలెక్టర్ నారాయణరెడ్డి చెప్పారు. ఈ భూములకు ఇప్పటికే ఫెన్సింగ్ వేసుకున్నట్లు తెలిపారు. మొత్తం 550లో 400 ఎకరాల వేకెంట్ ల్యాండ్ ఉందన్నారు. ప్రస్తుతం వేకెంట్ ల్యాండ్ స్వాధీనం చేసుకుంటున్నట్లు చెప్పారు.
సెటిల్మెంట్ రికార్డుల్లో సర్కార్ పోరంబోకు భూమి అని తేలిందని.. పహాణీలో కొందరు ప్రైవేటు వ్యక్తుల పేర్లు ఉన్నాయని తెలిపారు. విలువైన భూములను కాపాడుకున్నామని అన్నారు. ఈ ల్యాండ్ విలువ 50 వేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్పారు.
మియాపూర్ భూముల వివాదానికి సుప్రీంకోర్టు తీర్పుతో తెరపడిన విషయం తెలిసిందే. 1995 నుంచి కొనసాగుతున్న సుదీర్ఘ న్యాయ వివాదానికి ముగింపు పలికింది కోర్టు. ఈ తీర్పుతో సర్వే నంబర్లు 100, 101 పరిధిలోని భూములపై ప్రభుత్వ చర్యలు మొదలుపెట్టింది.
