నోటి దుర్వాసనతో ఇబ్బందా ? ఇంట్లోనే ఇలా మౌత్ ఫ్రెషనర్ తో బైబై చెప్పండి..

 నోటి దుర్వాసనతో ఇబ్బందా ? ఇంట్లోనే ఇలా మౌత్ ఫ్రెషనర్ తో  బైబై చెప్పండి..

నోట్లో వాసన కలిగించే బ్యాక్టీరియా పెరిగినప్పుడు.. అలాగే పొట్టలో ఏదైనా సమస్య ఉంటే నోటి దుర్వాసన సమస్య ఎదురవుతుంటుంది. పచ్చి ఉల్లిగడ్డ, వెల్లుల్లి తినడం కూడా దీనికి మరో కారణం. ఈ సమస్యకు కచ్చితంగా మౌత్ ఫ్రెషనర్ వాడాల్సిందే. మార్కెట్ లో దొరికే మౌత్ ఫ్రెషనర్ కొనుక్కుని తెచ్చుకోవడం ఈజీనే. కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొద్దంటే మాత్రం ఇంట్లో తయారు చేసుకోవాలి. ముఖ్యంగా వంటింటి పదార్థాలతో ఈజీగా చేసుకోవచ్చు.

ముందుగా సోంపు, ధనియాలు, తెల్ల నువ్వులను పావు కప్పు చొప్పున తీసుకోవాలి. అలాగే సొంఠి పొడి, దాల్చిన చెక్క పొడి, లవంగ పొడిని అర-టీ స్పూన్ చొప్పున, రెండు టేబుల్ స్పూన్ల ఇలాచీ గింజలు, పావు కప్పు ఎండు కొబ్బరి తురుము, వాము, అవిసె గింజలు, గుమ్మడి గింజలను ఒక టేబుల్ స్పూన్ చొప్పున, పావు కప్పు మిస్త్రీ తీసుకోవాలి. స్టవ్ పై పాన్లో సోంపు, ధనియాలు, తెల్ల నువ్వులు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, వాము, ఎండు కొబ్బరి తురుము వేసి దోరగా వేగించి గిన్నెలో వేయాలి. అందులో పొడులు, మిస్రీ వేసి కలపాలి. దీన్ని ఎయిర్ టైట్ కంటెయినర్ లో నిల్వ చేసుకుంటే, ఆరునెలల వరకు తాజాగా ఉంటుంది.