తమిళ స్టార్ హీరో, ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన పేరుతో సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు పుట్టుకొస్తున్నాయని, వాటి విషయంలో అభిమానులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అంతేకాదు.. తనకు ఎలాంటి అధికారిక ఫ్యాన్స్ అసోసియేషన్ లేదని స్పష్టంచేస్తూ ఓ కీలక ప్రకటన విడుదల చేశారు. ఆయన చేసి ఈ ప్రకటన ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
నకిలీ ఖాతాలపై అలర్ట్..
దర్శకుడిగా తొలి అడుగు వేసిన జేసన్ సంజయ్.. తన నెక్ట్స్ సినిమా కంటే ముందుగా తన గుర్తింపును దుర్వినియోగం చేస్తున్న నకిలీ ఖాతాలపై దృష్టి పెట్టారు. తన పేరు, ఫొటోలు, వ్యక్తిగత గుర్తింపును ఉపయోగించుకుంటూ.. ఇతర సోషల్ మీడియా వేదికల్లో కొనసాగుతున్న ఖాతాలన్నీ నకిలీవేనని ఆయన తేల్చిచెప్పారు. అలాంటి ఖాతాల నుంచి వచ్చే మెసేజ్‌లు, కామెంట్లు, వ్యాపార ప్రతిపాదనలు తనకు సంబంధించినవి కావని స్పష్టం చేశారు. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్‌బుక్‌లలో తనకు సంబంధించిన అసలైన ఖాతాల వివరాలను వెల్లడించారు. వాటిని మాత్రమే అనుసరించాలని అభిమానులకు సూచించారు.
ఫ్యాన్స్ క్లబ్‌లపైనా క్లారిటీ..
అంతే కాదు సంజయ్ జేసన్ చేసిన మరో ప్రకటన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తన పేరుతో ఎలాంటి అధికారిక ఫ్యాన్స్ క్లబ్‌ను కానీ, అభిమాన సంఘాన్ని కానీ ప్రారంభించలేదని వెల్లడించారు. తన అనుమతి లేకుండా ఏర్పాటైన గ్రూపులు, పేజీలు అధికారికమైనవిగా ప్రచారం చేసుకోవడం పూర్తిగా తప్పని పేర్కొన్నారు. ముఖ్యంగా తన పేరుతో ఎవరైనా డబ్బులు అడిగినా, వ్యాపార లావాదేవీలకు ప్రయత్నించినా నమ్మవద్దని హెచ్చరించారు.
మరోవైపు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమైన 'సిగ్మా' అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైంది. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హీస్ట్ థ్రిల్లర్‌కు బాక్సాఫీస్ వద్ద అశించిన స్థాయిలో సక్సెస్ ను అందుకోలేపోయింది. తండ్రి విజయ్ రాజకీయ బాధ్యతల కారణంగా సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉన్నప్పటికీ.. తల్లి సంగీత, సోదరి దివ్య థియేటర్‌కు వచ్చి మద్దతు తెలిపారు.
My only official accounts are Instagram - jason.sanjay_official , Facebook - JasonSanjay , and X - @official_jsj — Jason Sanjay https://t.co/xdGYHQJqYC
— Jason Sanjay Official (@official_jsj) October 29, 2026
