ఆ మధ్య మహారాష్ట్రలోని ఒక ప్రీస్కూల్ లో 23 నెలల చిన్నారిని మరో చిన్నారి కొరికి, కరిచి, కొట్టి , తన్ని.. చావుబతుకుల్లోకి నెట్టేసిన ఘటన గుర్తుండే ఉంటుంది. అంతకు మించిన క్రూరత్వం ఉన్న బాలరాక్షసుని వీడియో ఇది. ఎల్కేజీ చిన్నారిని డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) లో కొట్టినట్లుగా ఘోరంగా కొట్టిన వీడియో వైరల్ గా మారింది. చూస్తే చిన్న పిల్లోడే కాని.. వాడి కొట్టుడు చూస్తుంటే వీడు మనిషేనా.. వీడు ఉండాల్సింది జువెనైల్ జైల్లో కదా అనిపించకమానదు. వీడియో చూడాలంటే కూడా ధైర్యం సరిపోనట్లుగా ఉంది ఆ దాడి.
వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని పంచకుల సెక్టార్ 20లో ఉన్న సంస్కృతి మోడల్ స్కూల్ లో జరిగింది ఘటన. క్లాస్ రూమ్ లో ఎవరూ లేని సమయంలో ఎల్కేజీ చిన్నారిపై 3వ తరగతి విద్యార్థి (8 ఏళ్ల బాలుడు) అత్యంత కిరాకతకంగా.. రాక్షసులు బతికుంటే ఇలాగే ఉంటారు అన్నంత దారుణంగా దాడి చేశాడు. చిన్నారిపై రాళ్లు, ఇటుక, ఫ్లవర్ పాట్ తో దాడి చేయడం చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.
మొదట చిన్నారి తలను టేబుల్ పై కొట్టి.. ఆ తర్వాత కొడుతూ, తంతూ కింద పడేసి హంతకులకు కూడా లేనంత అసనంతో ఊగిపోయాడు. చిన్నారి వద్దని బతిమాలుతున్నా వదలకుండా దాడిచేశాడు. గొంతుపై తన్ని, నిలబడి.. అక్కడితో కసి తీరక బయటకి వెళ్లి ఇటుక, ఫ్లవర్ పాట్ తెచ్చి, అచ్చం రెజ్లింగ్ లో దాడి చేసినట్లుగా కొట్టాడు. ఇటుకను పదే పదే తలపై పడేసి రక్తం కక్కుకునేలా కొట్టాడు. ఇక చిన్నారి కదలటం లేదని తెలిసి.. చచ్చిందిలే అని కన్ఫామ్ చేసుకున్నాడో ఏమో.. అప్పుడు వదిలిపెట్టాడు.
తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య ఉన్న చిన్నారిని చిండీగఢ్ లోని PGIMER ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫూటేజ్ వైరల్ గా మారింది. పిల్లలు ఇద్దరూ క్లాస్ రూమ్ లో ఉన్న సమయంలో టీచర్లు, ఆయాలు ఎటు వెళ్లారు..? అందరూ బయట ఉన్నపుడు క్లాస్ రూమ్ కు చిన్నారులు వెళ్తున్నపుడు టీచర్లు ఎందుకు అడ్డుకోలేదు..? స్కూళ్లల్లో చిన్నారులకు రక్షణ ఎక్కడ..? అంటూ ప్రశ్నిస్తున్నారు.
🚨 Horrifying incident from Panchkula, Haryana! An 8-year-old boy brutally attacked a 6-year-old girl inside their classroom. He grabbed her by the hair, smashed her head against a desk, kicked her on the floor and repeatedly hit her with a brick. 💔 The little girl is seriously injured and undergoing treatment at PGIMER, Chandigarh. Both are school students. Just imagine the brutality inside a classroom. How did a brick become a weapon in a place where children are supposed to feel safe? The police are investigating. The school administration must answer for this shocking incident. https://t.co/fBGBU6I8pt
— Samridhi (@samridhi_i) October 31, 2026
చిన్నారుల్లో ఇంత క్రూరత్వం ఎక్కడిది..?
ఈ ఘటన చూసిన తర్వాత చిలక పలుకులు పలుకుతూ అక్షరాలు దిద్దాల్సిన చిన్నారుల్లో ఇంత క్రూరమనస్థత్వం ఎలా డెవలప్ అవుతుంది..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సోషల్ మీడియా కారణమా..? క్రైమ్ ఎపిసోడ్స్, రీల్స్ చూడటం, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లాంటి హింసాత్మక షోలు చూడటమేనా..? పేరెంట్స్ పిల్లలకు గారాబానికి ఫోన్లు ఇవ్వడంతో ఇలాంటివి నేర్చుకుంటున్నారా..? టీవీ రిమోడ్ చేతికిచ్చి వాళ్లు ఏం చూస్తున్నారో కూడా పట్టించుకోక పోవడంతో అక్కడి నుంచి ఇలాంటి వైఖరి డెవలప్ అవుతుందా..? పేరెంట్స్ క్రైమ్ సినిమాలు, WWE లాంటి షోస్ పిల్లలతో పాటు చూడటం వల్ల నేర్చుకుంటున్నారా..? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది.
పిల్లల్లో ఇలాంటి మానసిక ప్రవృత్తి పెరగటానికి కారణం పేరెంట్సే అని నెటిజన్లు, నిపుణులు అంటున్నారు. అతి గారాబం చేయడంతో పిల్లలు చిన్ననాటి నుంచి పేరెంట్స్ ను కొడుతూ, తంతూ పెరుగుతారని.. అలా అలుసుతో పెరిగిన వారిలో రాను రానూ క్రూర మనస్తత్వం పెరుగుతుందని చెబుతున్నారు. అలాంటి మెంటాల్టీ అలవాటు అయ్యే క్రమంలో వాళ్ల అభిరుచికి తగినట్లుగా క్రైమ్ వీడియోలు చూడటం, సినిమాలు, షోలు చూడటం చేస్తారని అంటున్నారు. అలా ఫోన్లలో, టీవీల్లో చూసి నేర్చుకున్న క్రిమినల్ యాక్టివిటీని సాటి పిల్లలపై ప్రయోగిస్తారని చెబుతున్నారు. పిల్లలకు ఫోన్లు ఇవ్వకపోవడం, క్రైమ్ షోస్, వీడియోలకు అలవాటు పడకుండా చూడటం చేయాలని చెబుతున్నారు. అంతే కాకుండా పిల్లలతో పాటు క్రైమ్ సీన్స్, రీల్స్ చూడకుండా ఉండాలని చెబుతున్నారు.
అంతేకాకుండా పిల్లలకు నీతి కథలు చెబుతూ పెంచాలని సలహా ఇస్తున్నారు నిపుణులు. చిన్ననాటి నుంచే మనో వికాసం పెంపొందించేలా చూడాలని సలహాలు ఇస్తున్నారు.
