ఏపీలో మళ్లీ వాయుగుండం పడింది : ఈసారి కోస్తా, రాయలసీమకు వర్షాలు

ఏపీలో మళ్లీ వాయుగుండం పడింది : ఈసారి కోస్తా, రాయలసీమకు వర్షాలు

అత్యంత బలమైన అర్నాబ్ తుఫాను నుంచి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ కోలుకోనేలేదు. అంతలోనే బంగాళాఖాతంలో మరో అల్పపీడన ఏపీని భయపెడుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న  అండమాన్ సముద్ర ప్రాంతాలపై  సుస్పష్టమైన అల్పపీడనం ఏర్పడినట్లు 2026 అక్టోబర్ 31న ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది రాబోయే 12 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది.

వాయుగుండం మరింత బలపడి ఎల్లుండి (నవంబర్ 02) సాయంత్రానికి  ఆంధ్రప్రదేశ్ తీరం సమీపంలోనికి చేరే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నవంబర్ 1 న సాయంత్రం నుంచి మూడురోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. 

ఈ వాయుగుండంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.