హైదరాబాద్ కొత్తపేటలో దారుణం.. భార్య చేతిలో భర్త హత్య!

హైదరాబాద్ కొత్తపేటలో దారుణం.. భార్య చేతిలో భర్త హత్య!

హైదరాబాద్ కొత్తపేటలో దారుణ ఘటన జరిగింది. భార్య చేతిలో భర్త హత్యకు గురైన ఘటన 2026 అక్టోబర్ 31న  కలకలం రేపింది. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

భార్యాభర్తల మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో భార్య కత్తితో భర్తపై దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన భర్త ప్రభాకర్ ను కొత్తపేటలోని ఓమ్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి భార్యను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.  దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.