Shehbaz Sharif trolled: హాంగ్ కాంగ్ సిక్సెస్ 2026 (Hong Kong Sixes 2026) టోర్నమెంట్లో భారత జట్టుపై పాకిస్తాన్ సాధించిన విజయాన్ని అభినందిస్తూ ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) పెట్టిన ఒక నెట్టింట పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీసింది. చిన్న టోర్నమెంట్ అయిన హాంగ్ కాంగ్ సిక్సెస్‌లో విజయాన్ని దేశ ప్రధాని ఇంతగా హైలైట్ చేయడంపై నెటిజన్లు గట్టిగానే ట్రోలింగ్ చేస్తున్నారు. ట్విట్టర్ (X) వేదికగా ప్రధాని షెహబాజ్ చేసిన కామెంట్స్‌పై సోషల్ మీడియాలో "బడా హి ఖాళీ పీఎమ్ హై" (భలే ఖాళీగా ఉన్న ప్రధాని) అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
ట్విట్టర్లో ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభినందనలు:
భారత్‌ను 4 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓడించిన వెంటనే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందిస్తూ.. ఇండియాపై ఘన విజయం సాధించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు అభినందనలు తెలియజేస్తూ, అద్భుతమైన క్రికెట్ ప్రదర్శన ఇచ్చారు! జట్టును నిరంతరం ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, ఆయన టీమ్‌కు ప్రత్యేక అభినందనలని రాసుకొచ్చారు. కేవలం 6 ఓవర్ల ఈ టోర్నీలో టీమిండియా నిర్దేశించిన 89 రన్స్ లక్ష్యాన్ని అబ్బాస్ అఫ్రిది (8 బంతుల్లో 35 - ఒకే ఓవర్లో 5 సిక్సర్లు), ఖవాజా నఫే (12 బంతుల్లో 41 నాటౌట్) ధాటికి పాక్ ఈజీగా ఛేజ్ చేసింది.
దేశంలో పనులు లేవా?.. నెటిజన్లు ఫైర్:
* పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించిన తీరుపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు, నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
* ఫన్నీ ట్రోల్స్: ఐసీసీ వరల్డ్ కప్ లేదా ప్రధాన అంతర్జాతీయ సిరీస్ కాకుండా కేవలం ప్రదర్శన మ్యాచ్‌ల తరహాలో జరిగే 'హాంగ్ కాంగ్ సిక్సెస్' గెలుపుకే ప్రధాని స్థాయి వ్యక్తి ప్రకటనలు ఇవ్వడంపై దేశంలో నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం వదిలేసి ఇలాంటి చిన్న టోర్నీలకు ప్రధాని సమయం కేటాయిస్తున్నారు.. ఈయన చాలా ఖాళీగా ఉన్న ప్రధాని అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
* క్రికెట్ సర్కిల్లో చర్చ: భారత్ పై గెలిస్తే చాలు ఏదైనా సరే పండగ చేసుకునే మనస్తత్వం పాకిస్తాన్ పాలకులలో కనిపిస్తోందని ఇండియన్ క్రికెట్ అభిమానులు గట్టిగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
