నవంబర్ నెల జ్యోతిష్యం : మకర రాశి వాళ్లు ఆవేశం తగ్గించుకోవాలి.. తొందరపాటు ఉంటే నష్టమే..

నవంబర్ నెల జ్యోతిష్యం : మకర రాశి వాళ్లు ఆవేశం తగ్గించుకోవాలి.. తొందరపాటు ఉంటే నష్టమే..

నవంబర్​ నెల మకర రాశి వారికి చాలా కీలకం కానుంది.  ఈ రాశి వారికి గ్రహాల సంచారం అంతగా అనుకూలంగా లేదని పండితులు చెబుతున్నారు.  ఏవిషయంలో కూడా తొందరపడవద్దని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.. ఈ రాశి వారు ఈ నెలలో ఏఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !

  • నవంబర్ 6 (అర్ధరాత్రి 12:45 గంటలకు)  శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం
  •  నవంబర్ 14న  కన్యారాశిలో శుక్రుడు సంచారంలో దిశ మార్పు
  • నవంబర్ 22 (సాయంత్రం 5:38 గంటలకు) శుక్రుడు తులా రాశిలోకి ప్రవేశం
  •   నవంబర్ 12 (రాత్రి 8:30 గంటలకు) కుజుడు సింహ రాశిలోకి ప్రవేశం
  •  నవంబర్ 13న   తులారాశిలో బుధుడు సంచారంలో దిశ మార్పు
  • నవంబర్ 16 (సాయంత్రం7:48 గంటలకు)సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం 
  •  నవంబర్ 25న రాహువు మకరరాశిలోకి ప్రవేశం

 నవంబర్ నెలలో మకర రాశి వారు  కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది.  ఆవేశం తగ్గించుకోవాలి.. తొందరపాటు నిర్ణయాల వలన నష్టం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ బాధ్యతలు, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ అవసరాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కానీ క్రమశిక్షణతో పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. వ్యాపారులు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. 

 మీరు చేసే కష్టానికి, బాధ్యతలకు తగిన గుర్తింపు లభిస్తుంది. అనుకున్న ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది. సహనం, ఓర్పు చాలా  అవసరమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కొత్త వ్యాపారాల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోంది.  కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా పార్టనర్‌షిప్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. 

ఈ రాశి వారు ఈ నెలలో  అప్పులు, పన్నులకు సంబంధించిన వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయకూడదు. ఆర్థికంగా ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన అవసరం. ప్రేమ వ్యవహారంలో జాగ్రత్తగా ఉండండి. 

 మూడవ ఇంట్లో రాహువు  సంచారం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
తొమ్మిదవ ఇంట్లో బృహస్పతిసంచారం వలన ఆధ్యాత్మిక చింతన పురోగతి
 కుజుడు ఎనిమిదవ ఇంట్లో సంచారం వలన ఆర్థిక విషయాల్లో అప్రమత్తత అవసరం

పరిహారం: గురువారం  బ్రాహ్మణుడికి దక్షిణతో స్వయంపాకం దానం చేయండి.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.