జ్యోతిష్యం :ధనస్సురాశి వారి జాతకం .. నవంబర్ నెల .. ఉద్యోగులకు మంచి గుర్తింపు.. ఖర్చులు పెరిగే అవకాశం

జ్యోతిష్యం :ధనస్సురాశి వారి జాతకం ..  నవంబర్ నెల .. ఉద్యోగులకు మంచి గుర్తింపు.. ఖర్చులు పెరిగే అవకాశం

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం 2026 నవంబర్​ నెలకు చాలా ప్రాధాన్యత ఉంది.. ఈ నెలలో దీపావళి పండుగతో పాటు .. రమైక ఏకాదశి, కార్తీకమాసం ప్రారంభం కానుంది. కీలక గ్రహాలు వాటి స్థానాలు మారనున్నాయి.  ఈ నేపథ్యంలో ఈ నెలలోధనస్సురాశి వారికి  రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .! 

  • నవంబర్ 6 (అర్ధరాత్రి 12:45 గంటలకు)  శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం
  •  నవంబర్ 14న  కన్యారాశిలో శుక్రుడు సంచారంలో దిశ మార్పు
  • నవంబర్ 22 (సాయంత్రం 5:38 గంటలకు) శుక్రుడు తులా రాశిలోకి ప్రవేశం
  •   నవంబర్ 12 (రాత్రి 8:30 గంటలకు) కుజుడు సింహ రాశిలోకి ప్రవేశం
  •  నవంబర్ 13న   తులారాశిలో బుధుడు సంచారంలో దిశ మార్పు
  • నవంబర్ 16 (సాయంత్రం7:48 గంటలకు)సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం 
  •  నవంబర్ 25న రాహువు మకరరాశిలోకి ప్రవేశం

ధనుస్సు రాశి వారికి 2026 నవంబర్ నెలలోవృత్తి, ఆర్థిక మరియు వ్యక్తిగత జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  

లాభ స్ధానంలో బుధుడు.. భాగ్యస్థానంలో గురుడి సంచారం వలన ఉద్యోగస్తులకు పురోగతి ఉండే అవకాశం ఉంది.  మీ పని తీరుకు అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. గతంలో నిలిచిపోయిన  ఒకసారి పరిశీలించుకోవాలని పండితులు సూచిస్తున్నారు. సహోద్యోగులతో ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దు. 

ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఆదాయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.  అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కొత్త పెట్టు బడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. 

ఈ రాశి వారు నవంబర్​ నెలలో కొత్త ఆలోచనల ప్రకారం  భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడానికి చాలా  అనుకూలంగా ఉంటుంది.  మీ ప్రయత్నాలకు మంచి స్పందన లభించే అవకాశం ఉంది. కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకునేటప్పుడు ఆచరణాత్మకంగా ఆలోచించండి. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు కొత్త మార్గాల గురించి ఆలోచించాలని పండితులు సూచిస్తున్నారు. ప్రయాణం, కుటుంబం లేదా వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పొదుపుపై ​​దృష్టి పెడితే మంచి జరిగే అవకాశం ఉంది.

ALSO READ : జ్యోతిష్యం : కుంభరాశి జాతకం.. ముఖ్యమైన పనుల్లో విజయం..

 కొత్త బాధ్యతలు,  కొత్త ప్రాజెక్టులకు అవకాశాలు వస్తాయి. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త మార్గాల కోసం ప్రయత్నించండి. ఇక ఆరోగ్యి విషయానికి వస్తే  పని ఒత్తిడి వల్ల అలసట, నీరసంగా ఉండే అవకాశం ఉంది. తగినంత విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని పండితులు చెబుతున్నారు.

  • తొమ్మిదవ ఇంట్లో ఉన్న కుజుడు ఉన్నత విద్య, ప్రయాణం , శిక్షణలో మీ కార్యకలాపాలను పెంచుతాడు. 
  •  శుక్రుడు పదవ ఇంట్లో సంచారంవలన  ప్రెజెంటేషన్లు , వృత్తిపరమైన సంబంధాలపై దృష్టి పెట్టాలి సూర్యుడు పన్నెండవ ఇంట్లో సూర్యుడు సంచారం వలన అనవసర ప్రయాణాలు, ఖర్చులు పెరిగే అవకాశం 

పరిహారం: గురువారం బ్రాహ్మణులకు దక్షిణతో స్వయంపాకం ఇవ్వాలి.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.