2026 నవంబర్ నెలలోదీపావళి.. నాగులచవితి పండుగలతో పాటు .. ఆధ్యాత్మిక మాసం కార్తీక మాసం ప్రారంభం కానుంది. గ్రహాల సంచారంలో కీలక మార్పులు ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ నెలలోవృశ్చిక రాశి వారి జీవితంలో సరికొత్త సమీకరణాలకు తెరలేపే అవకాశాలున్నాయి. గ్రహాల సంచారం ఆధారంగా ఈ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
- నవంబర్ 6 (అర్ధరాత్రి 12:45 గంటలకు) శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం
- నవంబర్ 14న కన్యారాశిలో శుక్రుడు సంచారంలో దిశ మార్పు
- నవంబర్ 22 (సాయంత్రం 5:38 గంటలకు) శుక్రుడు తులా రాశిలోకి ప్రవేశం
- నవంబర్ 12 (రాత్రి 8:30 గంటలకు) కుజుడు సింహ రాశిలోకి ప్రవేశం
- నవంబర్ 13న తులారాశిలో బుధుడు సంచారంలో దిశ మార్పు
- నవంబర్ 16 (సాయంత్రం7:48 గంటలకు)సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం
- నవంబర్ 25న రాహువు మకరరాశిలోకి ప్రవేశం
వృశ్చిక రాశి వారికి2026 నవంబర్ మాసంలో గ్రహాల స్థితిగతుల ప్రకారం మిశ్రమ ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు కొత్త బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. సహోద్యోగులతో పాటు ఉన్నతాధికారుల అనుగ్రహం కలుగుతుంది. ఆఫీసులో మంచి వాతావరణం ఉంటుంది. వ్యాపారస్తులకు గతంలో నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడుల వలన మంచి లాభాలు వస్తాయి. ఆదాయ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబంలో సామరస్యం, సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
ఈ రాశి వారు నవంబర్ నెలలో లక్ష్యాలను సాధిస్తారు. ఓర్పు, పట్టుదలతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. పాత బకాయిలను వసూలవుతాయి. ఉద్యోగం మారాలనుకొనే వారికి మంచి సమయమని పండితులు చెబుతున్నారు.
ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. గతంలో ప్రారంభించిన పనుల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన, అనుబంధం పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా సాగుతుంది.
- శని (6వ ఇల్లు): శని భగవానుడు ఆరవ ఇంట్లో సంచారం వలన శత్రువులపై విజయం, రోగాల నుండి ఉపశమనం , పనుల్లో పట్టుదల
- బృహస్పతి (11వ ఇల్లు): లాభ స్థానంలో గురుడు సంచారం వలన ఆర్థికంగా అభివృద్ధి, ఆశించిన ధనలాభం
- రాహువు ఐదవ ఇంట సంచారం వలన సంతానం విషయంలో ఆందోళన
- కేతువు సంచారం వలన ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది
పరిహారం: ప్రతిరోజూ 27 సార్లు "ఓం గం గణపతయే నమః" జపం చేయాలి
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
