ఏపీలో ప్రేమ ఉన్మాదం : రంపంతో చిన్నారి గొంతు కోసినోడు వీడే.. ఆ అమ్మాయికి చుట్టమే అంట

ఏపీలో ప్రేమ ఉన్మాదం : రంపంతో చిన్నారి గొంతు కోసినోడు వీడే.. ఆ అమ్మాయికి చుట్టమే అంట

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా రాప్తాడు ఘటన కలకలం రేపుతోంది. ప్రభుత్వ స్కూల్ లోకి వచ్చి పదో తరగతి చిన్నారి గోపికను.. ఎలక్ట్రిక్ రంపంతో గొంతు కోయటం, చెయ్యి కట్ చేయటం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఇంత ఘోరం చేసింది ఎవరో తెలుసా.. 21 ఏళ్ల హేమంత్ అంట.. స్కూల్ లోకి వచ్చి.. తరగతి గదిలోనే.. పిల్లలు అందరి ముందు.. పాఠం చెబుతున్న టీచర్ ఎదుట.. ఉన్మాదంగా తెగబడి మరీ ఎలక్ట్రిక్ రంపంతో చిన్నారి గోపిక గొంతు కోశాడు.. చెయ్యి నరికాడు.. వాడు ఎవడో కాదు హేమంత్ అనే కుర్రోడు. 

కొన్నాళ్లుగా ప్రేమ ప్రేమ అంటూ గోపిక వెంట పడుతున్నాడు ఈ హేమంత్. వీడు గోపికకు మేనమామ వరస అవుతాడు అని చెబుతున్నారు స్థానికులు. 10వ తరగతి చదువుతున్న గోపిక వెంట ప్రేమ అంటూ తిరుగుతున్నాడు. హేమంత్ అంటే ఇష్టం లేని గోపిక చాలా సార్లు మందలించింది అంట.. అయితే వరసకు చుట్టమే కావటం.. మేనమామ వరస కావటంతో ఇప్పటి వరకు ఎలాంటి కంప్లయింట్ చేయలేదని చెబుతున్నారు స్థానికులు. నిందితుడు హేమంత్ ధర్మవరంకు చెందిన వాడని.. తల్లిదండ్రులు చనిపోవటంతో.. రాప్తాడులోని అక్కయ్య దగ్గర ఉంటున్నాడని చెబుతున్నారు స్థానికులు. పదేళ్లుగా రాప్తాడులోనే ఉంటున్నాడని.. ఏం పనులు చేస్తున్నాడో తెలియదు అని చెబుతున్నారు స్థానికులు. 

తన ప్రేమను గోపిక నిరాకరించటం, మాట్లాడితే మాట్లాకపోవటం వంటి కారణాలతో గోపికపై ద్వేషం పెంచుకున్నాడు హేమంత్. గోపికపై ఎలాగైనా పగ తీర్చుకోవాలనే కసితో ఉన్నాడు. ఈ క్రమంలోనే 2026, అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం.. ఎలక్ట్రిక్ రంపంతో గోపిక చదువుకునే స్కూల్ కు వచ్చాడు. నేరుగా తరగతి గదిలోకి వెళ్లి దాడి చేశాడు. 

ఈ ఘోరం చేసిన తర్వాత.. అక్కడి నుంచి పారిపోయాడు హేమంత్. విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగారు. ధర్మవరం రైల్వేస్టేషన్ లో నిందితుడు హేమంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ధృవీకరించలేదు పోలీసులు.