ఏపీలో ఉన్మాదం : స్కూల్ లోకి ఎలక్ట్రిక్ రంపంతో వచ్చి చిన్నారి చెయ్యి నరికి, గొంతు కోశాడు

ఏపీలో ఉన్మాదం : స్కూల్ లోకి ఎలక్ట్రిక్ రంపంతో వచ్చి చిన్నారి చెయ్యి నరికి, గొంతు కోశాడు

వీడు మనిషా రాక్షసుడా.. రాక్షసుడు అనేది కూడా చిన్న మాటనే.. ఇలాంటి ఆలోచన వచ్చిందంటే వాడు మనిషి కాదు మృగం అని స్పష్టం అయ్యింది. ఏపీ రాష్ట్రం అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన ఘోరం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మనుషులు అన్నోళ్లు అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా రాప్తాడు కేంద్రం. ప్రభుత్వ పాఠశాల ఉంది. ఆ స్కూల్ లో 10వ తరగతి చదువుతున్నది గోపిక అనే చిన్నారి. రోజు  మాదిరిగా.. ఆ పదో తరగతి అమ్మాయి స్కూల్ కు వచ్చింది. క్లాస్ జరుగుతున్నది. ఇదే సమయంలో ఓ రాక్షసుడు స్కూల్ వచ్చాడు. వస్తూ వస్తూ తనతో ఎలక్ట్రిక్ రంపం తీసుకొచ్చాడు. నేరుగా పదో తరగతి క్లాస్ రూంలోకి వెళ్లాడు. తనతో పాటు తెచ్చిన ఎలక్ట్రిక్ రంపంతో చిన్నారి గోపికపై దాడి చేశాడు. చిన్నారి గోపిక చెయ్యిని కోసేశాడు. రంపంతో గోంతు కోశాడు. ఈ దాడిలో పదో తరగతి చిన్నారి గోపిక చెయ్యి తెగిపోయింది. గోంతుపై లోతుగా గాట్లు పడ్డాయి. పెద్దగా కేకలు వేస్తూ ఆ చిన్నారి తరగతి గదిలోనే కుప్పకూలింది. ఈ ఘటనను అడ్డుకోబోయిన మరో చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి. 

ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు ఈ ఘోరం జరిగిపోయింది. క్లాస్ టీచర్ తో సహా మిగతా అందరూ తేరుకుని అడ్డుకోబోయే లోపు ఆ రాక్షసుడు అక్కడి స్కూల్ నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో కొట్టుకుంటున్న ఇద్దరు చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. 

దాడి జరిగిన చిన్నారి గోపిక ఆరోగ్యం విషమంగా ఉందని.. గాయాలు చాలా తీవ్రంగా ఉన్నాయని చెబుతున్నారు డాక్టర్లు. దాడిని అడ్డుకోబోయిన మరో చిన్నారిని ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు డాక్టర్లు. 

ఈ ఘటనపై కలకలం రేపుతోంది. రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పట్టపగలు.. మిట్ట మధ్యాహ్నం.. ఓ బయట వ్యక్తి వచ్చి.. ఎలక్ట్రిక్ రంపంతో చిన్నారిపై.. అత్యంత దుర్మార్గంగా.. ఘోరంగా దాడి చేయటం తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేసింది. పెద్ద సంఖ్యలో రాప్తాడు జనం స్కూల్ దగ్గరకు వచ్చారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సున్నితమైన అంశం కావటంతో భారీగా మోహరించారు పోలీసులు. 

దాడి చేసిన వాడికి 25 ఏళ్లు ఉండొచ్చని.. స్కూల్ లో నిర్మాణ పనులు జరుగుతున్నాయని.. ఆ పని కోసం వచ్చిన వ్యక్తి అనుకున్నాం అంటున్నారు స్కూల్ టీచర్లు. దాడి ఘటన జరిగినప్పుడు క్లాసులో టీచర్ ఉన్నారని.. ఇంత ఘోరంగా దాడి జరుగుతుందని ఊహించలేదని చెబుతున్నారు టీచర్లు. 

దాడి ఎందుకు జరిగింది.. ఆ చిన్నారి గోపికపై ఆ యువకుడు దాడి చేయటానికి కారణం ఏంటీ అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయంపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.