జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 నవంబర్ నెలలో కీలక గ్రహాలు స్థానాలు మారబోతున్నాయి. దీని ప్రభావం అన్ని రాశులపై ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.ఈ నెలలో మీనరాశి వారి జీవితంలో మిశ్రమ ఫలితాలతో అనేక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశాలున్నాయి. గ్రహాల సంచారం.. జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారంగా ఈ నెలలో ( నవంబర్ 2026) మీనరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. . .!
- నవంబర్ 6 (అర్ధరాత్రి 12:45 గంటలకు) శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం
- నవంబర్ 14న కన్యారాశిలో శుక్రుడు సంచారంలో దిశ మార్పు
- నవంబర్ 22 (సాయంత్రం 5:38 గంటలకు) శుక్రుడు తులా రాశిలోకి ప్రవేశం
- నవంబర్ 12 (రాత్రి 8:30 గంటలకు) కుజుడు సింహ రాశిలోకి ప్రవేశం
- నవంబర్ 13న తులారాశిలో బుధుడు సంచారంలో దిశ మార్పు
- నవంబర్ 16 (సాయంత్రం7:48 గంటలకు)సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం
- నవంబర్ 25న రాహువు మకరరాశిలోకి ప్రవేశం
మీన రాశి వారికి నవంబర్ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు తమ పనుల్లో మరింత క్రమశిక్షణ పాటించాలి. ఉద్యోగం మారాలి అనుకునేవారు సరైన అవకాశాల కోసం వేచి చూడాలి. వ్యాపారులు పాత బాకీల వసూళ్లపై దృష్టి పెట్టడం మంచిది. ఆర్థికంగా ఆదాయం, ఖర్చులను సమన్వయం చేసుకోవడం ముఖ్యం. అప్పులు తీసుకునే ముందు తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేయాలి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.
ముఖ్యమైన నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది. ప్రేమ జీవితంలో అపార్థాలు రాకుండా జాగ్రత్త పడాలి. విద్యార్థులు చదువులో ఎదురయ్యే ఇబ్బందులను పట్టుదలతో అధిగమిస్తారు.
ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగువేయాల్సి ఉంటుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కు వగా ఉంటుంది. ఉద్యోగపరంగా సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా నిలకడగా సాగుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందు తుంది. ఉద్యోగంలో అధికారుల అండదండలకు లోటుండదు. సహోద్యోగులతో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది.
వ్యాపారాల్లో పోటీదార్లు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు విజయవంత మవుతాయి. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. పిత్రార్జితం లభిస్తుంది. విద్యార్థులు రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది.
ఆరవ ఇంట్లో ఉన్న కుజుడు సంచారం వలన పనుల్లో కష్టాలు.. పోటీ పడాల్సిన పరిపరిస్థితులు
శుక్రుడు ఏడవ ఇంట్లో సంచారం వలన ఆర్థికంగా కొంతవరకు మేలు
సూర్యుడు తొమ్మిదవ ఇంట్లో సంచారంవలన అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది.
- పరిహారం: ప్రతిరోజూ 108 సార్లు “ఓం మండాయ నమః”ను పఠించండి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
