కుంభ రాశిలో జన్మించిన వారికి నవంబర్ నెల సగటు ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. ముఖ్యమైన పనులు విజయవంతమవుతాయి. గురువు సంచారం వల్ల శ్రమకు తగిన ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.
- నవంబర్ 6 (అర్ధరాత్రి 12:45 గంటలకు) శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం
- నవంబర్ 14న కన్యారాశిలో శుక్రుడు సంచారంలో దిశ మార్పు
- నవంబర్ 22 (సాయంత్రం 5:38 గంటలకు) శుక్రుడు తులా రాశిలోకి ప్రవేశం
- నవంబర్ 12 (రాత్రి 8:30 గంటలకు) కుజుడు సింహ రాశిలోకి ప్రవేశం
- నవంబర్ 13న తులారాశిలో బుధుడు సంచారంలో దిశ మార్పు
- నవంబర్ 16 (సాయంత్రం7:48 గంటలకు)సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం
- నవంబర్ 25న రాహువు మకరరాశిలోకి ప్రవేశం
నవంబర్ నెలలో గురుడు. శని, సూర్యుడు గ్రహాల సంచారం ఆధారంగా ఈ రాశి వారికి
ఉద్యోగ రంగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. పని ఒత్తిడి పెరిగినప్పటికినీ.. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగులతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది.ఆర్థిక పరంగా ఆదాయం బాగున్నప్పటికి ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది.ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. మానసిక ఒత్తిడి, కడుపు లేదా జీర్ణక్రియకు సంబంధించిన చిన్నపాటి సమస్యలు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. అయితే, బంధువులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.
ALSO READ : జ్యోతిష్యం నవంబర్ నెల.. మీనరాశి వారికి వ్యాపారంలో పోటీ..
కుంభరాశి వారికి 2026 నవంబర్ నెలలో శని మొదటి ఇంట్లో.. రాహువు ఏడవ ఇంట్లో.. కేతువు అననుకూల స్థానం కారణంగా సవాళ్లు ఎదురవుతాయి. ఆర్థిక నష్టాలు, కమ్యూనికేషన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బృహస్పతి అనుకూలత వలన కొంత వరకు ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఒత్తిడి, గుర్తింపు లేకపోవడం, వ్యాపారం, కెరీర్ పురోగతిలో ఇబ్బందులు ఉంటాయి. నెల మధ్యలో కొంచెం మెరుగుపడే అవకాశం ఉంది.
- పరిహారం: ప్రతిరోజూ 108 సార్లు “ఓం మండాయ నమః” ను పఠించండి.
- ప్రతిరోజు ప్రదోషకాలంలో ఓం నమశ్శివాయ నమ: అనే మంత్రాన్ని జపం చేయాలి
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
