పంజాబ్ ఎన్నికలకు ఆప్ ముందస్తు కసరత్తు.. 3 నెలల ముందే ఫస్ట్ లిస్ట్.. 40 మంది అభ్యర్థుల ప్రకటన

పంజాబ్ ఎన్నికలకు ఆప్ ముందస్తు కసరత్తు.. 3 నెలల ముందే ఫస్ట్ లిస్ట్.. 40 మంది అభ్యర్థుల ప్రకటన

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఇప్పటి నుంచే ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది. 2027లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం 40 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ ను శనివారం(అక్టోబర్31) ప్రకటించింది. మొదటి లిస్టులో సీఎం భగవంత్ మాన్‌తో పాటు పలువురు కీలక నేతలకు చోటు కల్పించింది.

ధురి నియోజకవర్గం నుంచి భగవంత్ మాన్ మరోసారి పోటీ చేయనున్నారు. అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్‌కు కోట్‌కపురా టికెట్ కేటాయించగా, మంత్రి సంజీవ్ అరోరాను లూధియానా వెస్ట్ నుంచి బరిలోకి దింపుతోంది.

ఈ లిస్టులో 40 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. పంజాబ్‌లో మొత్తం117 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మిగిలిన 77 స్థానాలకు అభ్యర్థులను ఆప్ తరువాత ప్రకటించనుంది. ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు. 

మరోవైపు, పంజాబ్‌లో బీజేపీ, శిరోమణి అకాలీదళ్ మధ్య పొత్తు అవకాశాలపై కూడా రాజకీయ చర్చ సాగుతోంది. ఈ పరిణామాల క్రమంలో ఆప్ ముందుగానే అభ్యర్థుల జాబితా ప్రకటించడం పంజాబ్ లో ఎన్నికల వేడిని పెంచింది. అయితే మిగిలిన 77 స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.