Kaante Director Sanjay Gupta: బాలీవుడ్ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 'కాంటే', 'షూటౌట్ ఎట్ వడాలా', 'కాబిల్' లాంటి ఐకానిక్ గ్యాంగ్‌స్టర్ అండ్ యాక్షన్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత సంజయ్ గుప్తా (Sanjay Gupta - 57) ఈరోజు (అక్టోబర్ 31, శనివారం) కన్నుమూశారు. నిన్న ( శుక్రవారం, అక్టోబర్ 30) రాత్రి తన ముంబై నివాసంలోని బాత్‌రూమ్‌లో ఆయన ప్రమాదవశాత్తు జారీ కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. ఇవాళ (శనివారం) ఉదయం వరకు ఈ విషయాన్ని ఎవరూ గమనించకపోవడంతో ఆయన అక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది.
'ఆతిష్' నుంచి 'కాంటే' వరకు సంజాయ్ ప్రస్థానం:
* 1994లో సంజయ్ దత్, రవీనా టాండన్‌లతో 'ఆతిష్' మూవీ ద్వారా దర్శకుడిగా అరంగేట్రం చేసిన సంజయ్ గుప్తా, బాలీవుడ్‌లో గ్యాంగ్‌స్టర్ సినిమాలకు సరికొత్త శైలిని పరిచయం చేశారు.
* స్టైలిష్ మేకింగ్ మార్క్: 2002లో అమితాభ్ బచ్చన్, సంజయ్ దత్, సునీల్ శెట్టిలతో తెరకెక్కించిన 'కాంటే' (Kaante) మూవీ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ చరిత్రలోనే నిలిచిపోయే మోస్ట్ సక్సెస్ ఫుల్ క్రైమ్ థ్రిల్లర్‌గా నిలిచింది.
* సూపర్ హిట్ చిత్రాలు: ముసాఫిర్, జిందా, షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా (నిర్మాతగా), షూటౌట్ ఎట్ వడాలా, జజ్బా, కాబిల్, ముంబై సాగా వంటి సూపర్‌హిట్ చిత్రాలను ఆయన అందించారు. 2024లో ఓటీటీలో విడుదలైన 'ది మిరాండా బ్రదర్స్' ఆయన డైరెక్షన్ చేసిన లాస్ట్ సినిమా ఇదే.
దిగ్భ్రాంతికి గురైన చిత్ర పరిశ్రమ:
* సంజయ్ గుప్తా అకస్మాత్తుగా మరణించడంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు, ట్రేడ్ అనలిస్ట్‌లు, నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
* తరణ్ ఆదర్శ్ ట్వీట్: ఈ వార్త విని మాటలు రావడం లేదు.. కొద్దిరోజుల క్రితమే ఆయన ఇంట్లో జరిగిన మాతా కీ చౌకీ కార్యక్రమంలో ఆయన్ను కలిశాను, సంజయ్ గుప్తా ఇక లేరనే వార్త చాలా బాధాకరం.. ఆయన కుటుంబానికి నా ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నాను అని సీనియర్ జర్నలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
* కేఆర్‌కే, అశోక్ పండిత్ కంబైన్డ్ రియాక్షన్స్: దర్శకుడు అశోక్ పండిత్, కమాల్ ఆర్ ఖాన్ (KRK)లు సంజయ్ గుప్తా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ.. బాలీవుడ్ ఒక గొప్ప టాలెంట్ ఉన్న ప్యాషనేట్ ఫిలిం మేకర్‌ను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Shocked beyond words... Just can't believe that director #SanjayGupta is no more... Met him just a few days ago at the Mata Ki Chowki held at his residence... This is truly heartbreaking and difficult to process... My deepest condolences to his family... Om Shanti 🙏🙏🙏 https://t.co/w231Krj2mo
— taran adarsh (@taran_adarsh) October 31, 2026
RIP Sanjay Bhai. I can’t believe that you have left. We were talking almost every 2nd day about films and Bollywood. You were aware about everything so much. I love you Sanjay and I will miss you everyday bro. https://t.co/n1Uo0JO6lm
— KRK (@kamaalrkhan) October 31, 2026
