వందమంది జానపద కళాకారులతో.. దేవిశ్రీ ప్రసాద్ సరికొత్త ప్రయోగం

వందమంది జానపద కళాకారులతో..  దేవిశ్రీ ప్రసాద్ సరికొత్త ప్రయోగం

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌‌‌‌  హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఎల్లమ్మ’.  ‘బలగం’ ఫేమ్ వేణు యల్దండి దర్శకత్వం వహిస్తున్నాడు.  దిల్ రాజు సమర్పణలో  శిరీష్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్‌‌‌‌ను దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 100 మంది సంప్రదాయ జానపద రిథమ్ ప్లేయర్లతో రికార్డ్ చేస్తున్నారు.  

దేవిశ్రీ ప్రసాద్ తనదైన సంగీతంతో జానపద కళల వైభవాన్ని చాటేందుకు సిద్ధమవుతున్నాడు.  త్వరలోనే ఈ పాటను విడుదల చేయనున్నారు.  ఇందులో ‘పర్షి’ అనే పాత్రలో దేవిశ్రీ కనిపించనున్నాడు.   మార్చి 5న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో  ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.