నవీన్ చంద్ర ఎన్సి 51 షూటింగ్ పూర్తి

నవీన్ చంద్ర ఎన్సి 51 షూటింగ్ పూర్తి

కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇప్పటికే యాభై చిత్రాలు పూర్తి చేసిన నవీన్ చంద్ర.. ప్రస్తుతం 51వ సినిమాలో నటిస్తున్నాడు. ఆర్‌‌‌‌‌‌‌‌.పి.బాల దర్శకత్వం వహించడంతో పాటు సినిమాటోగ్రాఫర్ పి.జి. ముత్తయ్యతో కలిసి నిర్మిస్తున్నారు. రీసెంట్‌‌‌‌గా  ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. 

కొత్త తరహా కథాంశంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేలా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు ఆర్‌‌‌‌‌‌‌‌.పి.బాల ఈ సందర్భంగా చెప్పారు.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌‌‌‌ వర్క్స్‌‌‌‌ జరుగుతున్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని నిర్మాత ముత్తయ్య తెలియజేశారు. 

హరిప్రియ రోషిణి, బాల శరవణన్, కాళీ వెంకట్, రవిశంకర్, రాజా రవీంద్ర, నవీన్ నేని, ఆదవ్ చంద్ర, అభిషేక్, విజయ సత్య ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. పి.జి. ముత్తయ్య సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, శక్తి బాలాజీ సంగీతం అందిస్తున్నారు.