మైత్రీ మూవీస్, మిట్టి అండ్ మూన్ ఫిలిమ్స్‌ సహనిర్మాణంలో మైనా

మైత్రీ మూవీస్, మిట్టి అండ్ మూన్ ఫిలిమ్స్‌ సహనిర్మాణంలో మైనా

కలర్ ఫొటో, బేబీ చిత్రాలతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకోవడంతోపాటు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా మంచి గుర్తింపును అందుకున్నారు  సాయి రాజేష్​.  ఇటీవల ‘చెన్నై లవ్‌‌‌‌స్టోరీ’ చిత్రానికి కథను అందించి  నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉంటూ సక్సెస్ సాధించారు.  తాజాగా తానే ఓ సొంత బ్యానర్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేశారు.  ‘మిట్టి అండ్ మూన్ ఫిలిమ్స్‌‌‌‌’ పేరుతో కొత్త బ్యానర్‌‌‌‌‌‌‌‌ను స్టార్ట్ చేసి తన ఫస్ట్ మూవీని అనౌన్స్ చేశాడు. ‘మైనా’ టైటిల్‌‌‌‌తో  ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. 

ఈ చిత్రాన్ని  మైత్రీమూవీ మేకర్స్ సహకారంతో నిర్మిస్తున్నట్టు  తెలియజేశారు. ఈ  సినిమా ద్వారా   చంటిబాబు అనే నూతన దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ ఆకట్టుకుంది. ఓ మహిళ చేతికి ఇనుప కంచె వేసినట్టుగా చూపిస్తూ.. దానిపై ఇద్దరు జంటలు, రెండు సీతాకోక చిలుకలు ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 

మణిశర్మ  ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ బ్యానర్‌‌‌‌‌‌‌‌  ప్రారంభంపై సాయి రాజేష్​ స్పందిస్తూ.. ‘‘ఇదొక నూతన ఆరంభం. గొప్ప సినిమా అంటే పెద్ద బడ్జెట్లు కాదు, గొప్ప ఆలోచనలు. కొత్త టాలెంట్‌‌‌‌ను ఎంకరేజ్ చేయడానికి మా నిర్మాణ సంస్థ సిద్ధంగా ఉంది’ అని తెలియజేశారు.