IPL: MI బ్యాటింగ్‌‌ కోచ్‌‌ గా టీమిండియా మాజీ బ్యాటర్‌‌ రాబిన్‌‌ ఉతప్ప

IPL: MI బ్యాటింగ్‌‌ కోచ్‌‌ గా టీమిండియా మాజీ బ్యాటర్‌‌ రాబిన్‌‌ ఉతప్ప

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌–2027 సీజన్‌‌ కోసం ముంబై ఇండియన్స్‌‌ (ఎంఐ) కొత్త కోచింగ్‌‌ స్టాఫ్‌‌ను నియమించింది. టీమిండియా మాజీ బ్యాటర్‌‌ రాబిన్‌‌ ఉతప్పను బ్యాటింగ్‌‌ కోచ్‌‌గా ఎంచుకుంది. కివీస్‌‌ మాజీ పేసర్‌‌ మిచెల్‌‌ మెక్లింగన్‌‌ను బౌలింగ్‌‌ కోచ్‌‌గా తీసుకుంది. 

టీమిండియా మాజీ ఫీల్డింగ్‌‌ కోచ్‌‌ టి. దిలీప్‌‌కు అదే బాధ్యతలు అప్పగించగా, ధవల్‌‌ కులకర్ణి డెవలప్‌‌మెంట్‌‌ బౌలింగ్ కోచ్‌‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఉతప్ప, మెక్లింగన్‌‌, కులకర్ణి గతంలో ముంబై ఇండియన్స్‌‌కు ప్రాతినిధ్యం వహించనవారే కావడం విశేషం. హెడ్‌‌ కోచ్‌‌ కీరన్‌‌ పొలార్డ్‌‌ నేతృత్వంలో ఈ కొత్త బృందం పని చేయనుంది.