భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌కు చేరుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం (అక్టోబర్ 30) అక్కడికి చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇండియాలో మాదిరిగానే న్యూజిలాండ్‌లో కూడా కోహ్లీని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. వందలాది మంది అభిమానులు కింగ్‌ను చూసేందుకు ఆక్లాండ్ ఎయిర్‌పోర్టుకు తరలివచ్చారు.
ఎయిర్ పోర్టులో భారత క్రికెటర్‌తో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ పోటీపడ్డారు. ముఖ్యంగా ఓ మహిళా అభిమాని కోహ్లీని చూసి తీవ్ర భావోద్వేగానికి గురైంది. సదరు లేడీ ఫ్యాన్ కోహ్లీని కలసి ఆటోగ్రాఫ్ తీసుకోవడం కోసం ఏకంగా రెండు రోజుల పాటు ఎయిర్‌పోర్టులోనే వేచి ఉంది. ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ నుంచి బయటకు రాగానే వెంటనే కోహ్లీ దగ్గరకు వెళ్లి తన చేతిలో ఉన్న కోహ్లీ చిన్నప్పటి పోస్టర్‌ను చూపిస్తూ ఎంతో ఎమోషనల్ అయింది.
కోహ్లీ ఆ పోస్టర్‌పై ఆటోగ్రాఫ్ ఇవ్వడంతో ఆనందంతో ఆమె కన్నీళ్లు ఆపుకోలేక ఎయిర్‌పోర్టులోనే బోరున ఏడ్చేసింది. లేడీ ఫ్యాన్ ఎమోషనల్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. న్యూజిలాండ్‌లో సైతం కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి.. వాడు ఎక్కడున్నా రాజేరా అంటూ అభిమానులు కామెంట్లతో రెచ్చిపోతున్నారు.
కాగా, భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ 2026, నవంబర్ 4 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసమే న్యూజిలాండ్ వెళ్లిన కోహ్లీ నెట్ కూడా ప్రాక్టీస్ షురూ చేశాడు. తమ అభిమాన ఆటగాడిని గ్రౌండ్ లో చూసేందుకు కింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్:
1వ వన్డే నవంబర్ 4 (బుధవారం) ఈడెన్ పార్క్, ఆక్లాండ్
2వ వన్డే నవంబర్ 7 (శనివారం) హెన్రీ స్టేడియం, వెల్లింగ్టన్
3వ వన్డే నవంబర్ 10 (మంగళవారం) సెడ్డన్ పార్క్, హామిల్టన్
4వ వన్డే నవంబర్ 13 (శుక్రవారం) బే ఓవల్, మౌంట్ మౌంగనూయి (టౌరంగా)
5వ వన్డే నవంబర్ 15 (ఆదివారం) బే ఓవల్, మౌంట్ మౌంగనూయి (టౌరంగా
It's really tough being Virat Kohli 😬 #Cricket #ViratKohli https://t.co/0R9GcsEZIz
— CREX (@Crex_live) October 30, 2026
