శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రూట్‎లో నడిరోడ్డుపై తగలబడ్డ కారు.. తృటిలో తప్పిన ప్రమాదం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రూట్‎లో నడిరోడ్డుపై తగలబడ్డ కారు.. తృటిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రధాన రహదారిపై శుక్రవారం (అక్టోబర్ 30) ఒక కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో తృటిలో ప్రమాదం తప్పింది. రహదారిపై ప్రయాణిస్తుండగా కారు ఇంజిన్ నుండి అకస్మాత్తుగా పొగలు, మంటలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. వెంటనే స్పందించిన కారును రోడ్డు పక్కన నిలిపివేసి, కిందకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు. 

నిమిషాల వ్యవధిలోనే మంటలు కారు మొత్తం వేగంగా వ్యాపించాయి. మంటల ధాటికి కారు పూర్తిగా కాలి బూడిదైంది. ప్రమాద సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, అర్జీఐఏ (RGIA) పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.