ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. NPCIL లో అప్రెంటిస్ ఖాళీలు 

ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. NPCIL లో అప్రెంటిస్ ఖాళీలు 

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్​పీసీఐఎల్) దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

మొత్తం ఖాళీలు: 80.
విభాగాల వారీగా ఖాళీలు
ట్రేడ్ అప్రెంటిస్ (ఐటీఐ): ఎలక్ట్రీషియన్ 25, ఫిట్టర్ 16, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 9.
డిప్లొమా అప్రెంటిస్:  మెకానికల్ 5, ఎలక్ట్రికల్ 3, ఎలక్ట్రానిక్స్ 2, సివిల్ 6.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: మెకానికల్ 4, ఎలక్ట్రికల్ 3, హ్యూమన్ రిసోర్స్ 3, ఫైనాన్స్ & అకౌంట్స్ 2, కాంట్రాక్ట్ & మెటీరియల్ మేనేజ్​మెంట్ 2. 
విద్యార్హతలు: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, టెక్నాలజీ లేదా ఇంజినీరింగ్​లో గ్రాడ్యుయేషన్, బీబీఏ, బీఏ, బీఎస్సీ, బి.కాం పూర్తిచేసి ఉండాలి. 
వయసు: 2026, నవంబర్ 18 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం:  అక్టోబర్ 29.
లాస్ట్ డేట్: నవంబర్ 18.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ npcilcareers.co.inను సందర్శించండి.
    – వెలుగు, ఎడ్యుకేషన్ డెస్క్