జ్యోతిష్యం: నవంబర్ నెల కీలక గ్రహాల మార్పు..మేష రాశి వారికి ఎలా ఉంటుంది.. వారు చేయాల్సిన పరిహారం ఇదే..!

జ్యోతిష్యం:  నవంబర్ నెల కీలక గ్రహాల మార్పు..మేష రాశి వారికి ఎలా ఉంటుంది.. వారు చేయాల్సిన పరిహారం ఇదే..!

మరో రెండు నెలల్లో 2026 వ సంవత్సరం కాల గర్భంలో కలిసిపోనుంది.  నవంబర్​నెలలో హిందువులకు పవిత్రమాసం కార్తీక మాసం ప్రారంభమవుతుంది. దీపావళి, నాగుల చవితి  అనేక పండుగలు ప్రారంభం కావడంతో చాలా గ్రహాలు కూడా తమ స్థానాలను మార్చుకుంటాయి.  ఈ నెలలో ( 2026 నవంబర్​) గ్రహాలు, నక్షత్రాలు సంచారం ప్రకారం 2026 నవంబర్ నెల మేషరాశి వారికి ఎలా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం...!

  • నవంబర్ 6 (అర్ధరాత్రి 12:45 గంటలకు)  శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం
  •  నవంబర్ 14న  కన్యారాశిలో శుక్రుడు సంచారంలో దిశ మార్పు
  • నవంబర్ 22 (సాయంత్రం 5:38 గంటలకు) శుక్రుడు తులా రాశిలోకి ప్రవేశం
  •   నవంబర్ 12 (రాత్రి 8:30 గంటలకు) కుజుడు సింహ రాశిలోకి ప్రవేశం
  •  నవంబర్ 13న   తులారాశిలో బుధుడు సంచారంలో దిశ మార్పు
  • నవంబర్ 16 (సాయంత్రం7:48 గంటలకు)సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం 
  •  నవంబర్ 25న రాహువు మకరరాశిలోకి ప్రవేశం

నవంబర్ 2026 మేషరాశి  వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ నెలలో గ్రహాల స్థితిగతుల ప్రకారం  ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి. పనిలో ఒత్తిడి, పోటీ అధికంగా ఉండే అవకాశం ఉంది.ఈ నెలలో  కొత్త పనుల్లో చొరవ తీసుకోవడానికి సమయం అనుకూలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. 

ఇక ఆర్థిక విషయాలకు వస్తే కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అందువలన  ఆర్థిక లావాదేవీల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆరోగ్యం విషయంలో  ఒత్తిడి కారణంగా కాళ్లు, తొడలు లేదా కీళ్ల నొప్పులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 

 రాశ్యధిపతి కుజుడు తనకు మిత్ర క్షేత్రమైన సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నందువల్ల  పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మనసులోని ఒకటి రెండు కోరి కలు, ఆశలు నెరవేరుతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాల్ని ముమ్మరం చేయడం మంచిది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ఉన్నత పద వులు లభిస్తాయి. 

వ్యాపారవేత్తలకు కొత్త కస్టమర్లను ఆకర్షించి, తమ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల  మద్దతు మీ మనోధైర్యాన్ని పెంచుతుంది..నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. మీ జీవిత భాగస్వామితో మీకు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటే, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు

 విదేశీ ఉద్యోగ లేదా విదేశీ స్థిర నివాస ప్రయత్నాలు చేయువారికి కలసివచ్చే అవకాశం ఉంది. ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. కుటుంబ పరమైన ఖర్చులు తగ్గుముఖం పడతాయి. సమాజంలోని పెద్దలతో లేదా ఉన్నత అధికారులతో పరిచయాలు ఏర్పతాయి. ఉద్యోగ జీవితంలో సమయానికి పనులు పూర్తి చేయుట లన చక్కటి గుర్తింపు సంపాదించగలుగుతారు. ద్వితీయ వారంలో చిన్న పిల్లలకు ఆరోగ్య పరమైన చికాకులు ఉండే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

పరిహారం: ప్రతిరోజూ “ఓం శివాయ నమః” అనే పవిత్ర మంత్రాన్ని 108 సార్లు జపం చేయాలి.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.