బంగారం, వెండి క్రాష్.. తులం రూ.3వేల 400 తగ్గిన గోల్డ్, కేజీకి రూ.10 వేలు తగ్గిన సిల్వర్!

బంగారం, వెండి క్రాష్.. తులం రూ.3వేల 400 తగ్గిన గోల్డ్, కేజీకి రూ.10 వేలు తగ్గిన సిల్వర్!

దీపావళి దగ్గర పడుతున్న వేళ బంగారం, వెండి కొనాలనుకుంటున్న వారికి మంచి అవకాశం వచ్చేసింది. అవునండి వరుసగా తగ్గుతున్న రేట్లతో జ్యువెలరీ షాపులకు జనం పోటెత్తుతున్నారు. ఇన్వెస్టర్లకు ఈ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ.. ఆభరణాలు షాపింగ్ చేసేవాళ్లకు ఈ వీకెండ్ మంచి అవకాశం. అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు షాపింగే చేసే ముందుగా తమ నగరాల్లో తగ్గిన ధరలను తెలుసుకోవటం మంచిది. 

అక్టోబర్ 31న బంగారం రేట్లు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.338 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.13వేల 888గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.12వేల 730గా కొనసాగుతోంది. 

శనివారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. అక్టోబర్ 31, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.10వేలు తగ్గింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీకి రూ.10వేలు తగ్గి రూ.2లక్షలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.200 దగ్గర ఉంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రానున్న మరికొద్ది రోజుల్లో వెండి ఇంకా తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నాయి.