లగ్జరీ కార్ల తయారీ సంస్థ మాసెరాటీ తన ఎస్‌యూవీ గ్రెకేల్ ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.1.14 కోట్లు. గ్రేకెల్లోని 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 5.6 సెకన్లలోనే 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. టాప్‌స్పీడ్ 240 కిలోమీటర్లు. టాప్ ఎండ్ ట్రోఫియో వేరియంట్‌లో 3 లీటర్ ఇంజిన్ ఉంటుంది. కేవలం 3.8 సెకన్లలోనే 100 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తుంది. గ్రేకెల్ ఎలక్ట్రిక్ వెర్షన్ ఫోల్గోర్‌ను కూడా తీసుకొచ్చామని, ఒకసారి చార్జ్‌చేస్తే 580 కి.మీ మైలేజ్ ఇస్తుందని మాసెరాటీ తెలిపింది.
