న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాలు పెరగడంతో దేశ రాజధాని ఢిల్లీలో బంగారం, వెండి ధరలు శుక్రవారం భారీగా తగ్గాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో కేజీ వెండి ధర ఏకంగా రూ.8,300 మేర పడగా, రూ.1,90,200 వద్ద ముగిసింది. ఇది గత 11 నెలల కనిష్ట స్థాయి. చివరిసారిగా డిసెంబర్ 10, 2025న వెండి రూ.1.92 లక్షల వద్ద ట్రేడైంది. మరోవైపు 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.1,300 తగ్గి రూ.1,45,200 వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ వెండి ఔన్సుకు 6 శాతం (3.1 డాలర్లు) పతనమై 49.06 డాలర్లకు పడిపోగా, బంగారం 3.04 శాతం క్షీణించి 3,899.33 డాలర్లకు దిగొచ్చింది. అమెరికాలో బలమైన జీడీపీ వృద్ధి , అధిక ద్రవ్యోల్బణం కారణంగా యూఎస్ ఫెడ్ మరోసారి వడ్డీ రేట్లను పెంచొచ్చన్న సంకేతాలు వెలువడటంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన యూఎస్ ట్రెజరీ బాండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో డివిడెండ్స్, వడ్డీలు వంటి ఫిక్డ్స్ ఇనకమ్ ఇవ్వని బంగారం, వెండిలో భారీగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతోంది.
