హైదరాబాద్, వెలుగు: గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో టూ వీలర్లు భారీగా అమ్ముడవుతున్నాయని అమెజాన్ తెలిపింది. పండుగ ఆఫర్లు మొదలైనప్పటి నుంచి సగటు విక్రయాలతో పోలిస్తే 6 రెట్లు వృద్ధి నమోదైంది. చిన్న నగరాల నుంచి 60 శాతం పైగా అమ్మకాలు జరుగుతున్నాయి. హీరో, బజాజ్, ఆంపియర్ వంటి దేశీయ బ్రాండ్లతో పాటు కేటీఎం, ట్రయంఫ్ వంటి అంతర్జాతీయ మోడళ్లకూ ఆదరణ దక్కుతోంది.
