మెన్స్‌‌ అండర్‌‌–19 జట్టులో అన్వయ్‌‌, ఆర్యవీర్‌‌

మెన్స్‌‌ అండర్‌‌–19 జట్టులో అన్వయ్‌‌, ఆర్యవీర్‌‌

న్యూఢిల్లీ: మెన్స్‌‌ అండర్‌‌–19 ఆసియా కప్‌‌కు ఇండియా టీమ్‌‌ను ప్రకటించారు. లెజెండ్‌‌ క్రికెటర్లు రాహుల్‌‌ ద్రవిడ్‌‌, వీరేంద్ర సెహ్వాగ్‌‌ కుమారులు అన్వయ్‌‌ ద్రవిడ్‌‌, ఆర్యవీర్‌‌ సెహ్వాగ్‌‌ జట్టుకు ఎంపికయ్యారు. అద్భుతమైన బ్యాటింగ్‌‌తో రాణిస్తున్న ఈ ఇద్దరు ఇటీవల ముగిసిన వినూ మన్కడ్‌‌ ట్రోఫీలో ఆకట్టుకున్నారు. 17 ఏళ్ల వికెట్‌‌ కీపర్‌‌ అన్వయ్‌‌.. గుజరాత్‌‌తో జరిగిన అండర్‌‌–19 మ్యాచ్‌‌లో వంద బాల్స్‌‌లోనే 151 రన్స్‌‌ చేసి టీమ్‌‌ను గెలిపించాడు. 

శ్రీలంకతో జరిగిన యూత్‌‌ వన్డేలోనూ 87 రన్స్‌‌ చేశాడు. 19 ఏళ్ల ఆర్యవీర్‌‌ చండీగఢ్‌‌తో జరిగిన మన్కడ్‌‌ ట్రోఫీలో 143 బాల్స్‌‌లోనే 173 రన్స్‌‌ సాధించాడు. అండర్‌‌–19 జట్టు: లక్ష్య రాయ్‌‌చందాని (కెప్టెన్‌‌), ఆర్యవీర్ సెహ్వాగ్, వీకే  వినీత్, యశ్‌‌వర్ధన్ సింగ్ చౌహాన్, కుశాగ్ర ఓజా, అర్జున్ రాజ్‌‌పుత్, మనల్ చౌహాన్, అన్వయ్ ద్రవిడ్, రజత్ బఘెల్, వి. యశ్‌‌వీర్, ఆర్య సావ్సాని, మోహిత్ ఉల్వా, కావ్య పటేల్, షవిన్ వినోద్, ఇషాన్ సూద్.