బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న మోహన్ లాల్.. తాజాగా మరో కొత్త చిత్రానికి కమిట్ అయ్యారు. అనూప్ సత్యన్ దీనికి దర్శకుడు. శుక్రవారం కొచ్చిలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. మోహన్ లాల్ కెరీర్‌లో ఇది 368వ సినిమా. క్విర్కీ కామెడీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందే ఈ చిత్రాన్ని ఆంటోనీ పెరుంబవూర్, బిను జార్జ్ అలెగ్జాండర్ నిర్మిస్తున్నారు.
సీనియర్ నటుడు ముఖేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆరేళ్ల క్రితం దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన ‘వరనే అవశ్యముంద్’ (తెలుగులో ‘పరిణయం’)తో దర్శకుడిగా పరిచయమైన అనూప్ సత్యన్.. మోహన్ లాల్‌తో సినిమా చేయడం కోసం ఆరేళ్లుగా వేచి చూశానని ఓపెనింగ్ ఈవెంట్‌లో చెప్పారు.
అతని తండ్రి సత్యన్ అంతికాడ్ డైరెక్షన్‌లో 20 సినిమాలు చేసిన తాను.. ఇప్పుడు ఆయన కొడుకు డైరెక్షన్‌లో నటించడం సంతోషంగా ఉందని మోహన్ లాల్ చెప్పారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్‌లో మోహన్ లాల్ ఇద్దరు చిన్నారులతో కనిపిస్తుండగా, ముగ్గురు సైన్ లాంగ్వేజ్‌లో ‘ఐ లవ్ యు’ అని చెబుతున్నారు.
