ఇండియా రెజ్లర్‌‌ మనీషా భన్వాలా కు స్వర్ణం

ఇండియా రెజ్లర్‌‌ మనీషా భన్వాలా కు స్వర్ణం

అస్తానా: ఇండియా రెజ్లర్‌‌ మనీషా భన్వాలా.. వరల్డ్‌‌ రెజ్లింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో చరిత్ర సృష్టించింది. శుక్రవారం జరిగిన విమెన్స్‌‌ 59 కేజీల ఫైనల్లో మనీషా 8–6తో అబిగైల్‌‌ నెట్టే (అమెరికా)పై సంచలన విజయం సాధించి గోల్డ్‌‌ మెడల్‌‌ను సొంతం చేసుకుంది. దాంతో మెగా టోర్నీలో స్వర్ణం నెగ్గిన తొలి ఇండియన్‌‌ విమెన్స్‌‌ రెజ్లర్‌‌గా రికార్డులకెక్కింది. 2010లో మెన్స్‌‌ 66 కేజీల టైటిల్ గెలిచిన సుశీల్‌‌ కుమార్‌‌ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఇండియన్‌‌ రెజ్లర్‌‌ మనీషానే కావడం విశేషం. 

బౌట్‌‌ ఆరంభంలో తడబడిన మనీషా ఓ దశలో 0–6తో వెనకబడింది. అయితే కీలక టైమ్‌‌లో అమెరికన్‌‌ రెజ్లర్‌‌ను మ్యాట్‌‌పై పడేసి వరుసగా పాయింట్లు సాధించింది. ఒకే చాంపియన్‌‌షిప్‌‌లో ముగ్గురు విమెన్‌‌ రెజ్లర్లు స్వర్ణ పతకాల పోరుకు అర్హత సాధించడం కూడా ఇదే మొదటిసారి. అయితే నీలం సరోహి (50 కేజీ), కాజల్‌‌ ధోచక్‌‌ (76 కేజీ) ఫైనల్స్‌‌ ఓడి సిల్వర్‌‌ మెడల్స్‌‌తో సరిపెట్టుకున్నారు.