సారాబ్రూకెన్: ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు.. హైలో ఓపెన్ సూపర్–500 టోర్నీలో సెమీస్‌లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో సింధు 21–12, 21–10తో అమాలీ షుల్జ్ (జర్మనీ)పై గెలిచింది. స్టార్టింగ్ నుంచే తనదైన ట్రేడ్ మార్క్ షాట్లతో చెలరేగిన తెలుగమ్మాయి 27 నిమిషాల్లోనే ప్రత్యర్థికి చెక్ పెట్టింది. మొత్తం 64 పాయింట్లలో 42 సాధించిన సింధు ఆద్యంతం మ్యాచ్‌ను నియంత్రణలో ఉంచుకుంది.
మరో మ్యాచ్‌లో అన్మోల్ ఖర్బ్ 21–17, 18–21, 21–16తో ఉన్నతి హుడాపై గెలిచి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. మెన్స్ క్వార్టర్‌ఫైనల్లో లక్ష్యసేన్ 14–21, 21–17, 21–16తో కల్లే కోల్జోనెన్ (ఫిన్లాండ్)పై గెలిచాడు.
